For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2026 ముందు దుమ్మురేపిన తిలక్ వర్మ!

Tilak Varma: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ముందు టీమిండియా బ్యాటర్ తిలక్ వర్మ దుమ్మురేపాడు. వృషణాల శస్త్ర చికిత్స‌‌తో భారత జట్టుకు దూరమైన తిలక్ వర్మ.. పూర్తిగా కోలుకొని భారత్-ఏ తరఫున సత్తా చాటాడు. అమెరికా ప్రపంచకప్ జట్టుతో సోమవారం డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన వాపమ్ మ్యాచ్‌లో ఆయుష్ బదోని సారథ్యంలోని భారత్-ఏ జట్టు 38 పరుగుల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో మూడో స్థానంలో బరిలోకి దిగిన తిలక్ వర్మ 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 పరుగులు చేశాడు. 158.33 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముందు తిలక్ వర్మ పూర్తి ఫిట్‌నెస్ సాధించి ఫామ్‌ కనబర్చడంపై టీమిండియా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

India A vs USA Tilak Varma Ticks All Boxes with Solid 38 on Return ready for T20 World Cup 2026

జగదీష్ సెంచరీ..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్-ఏ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 238 పరుగులు చేసింది. నారయణ్ జగదీషన్(55 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 104) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ ఆయుష్ బదోని(26 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 60 నాటౌట్) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.

అమెరికా బౌలర్లలో అలీ ఖాన్, జస్‌దీప్ సింగ్, శుభమ్ రంజనే తలో వికెట్ తీసారు. అనంతరం అమెరికా 19.4 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. సంజయ్ కృష్ణమూర్తి(18 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 41), ఆండ్రీస్ గౌస్(31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44) టాప్ స్కోరర్లుగా నిలిచారు. రవి బిష్ణోయ్(3/37) మూడు వికెట్లతో సత్తా చాటగా.. నమన్ ధీర్(2/6), ఖలీల్ అహ్మద్(2/25) రెండేసి వికెట్లు తీసారు.

సంజూ శాంసన్ ఔట్..

బుధవారం రాత్రి 7.30 గంటలకు ముంబైలోని డివైపాటిల్ స్టేడియంలో భారత ప్రపంచకప్ జట్టు.. సౌతాఫ్రికా వరల్డ్ కప్ టీమ్‌తో వామప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ తరఫున కూడా తిలక్ వర్మ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. తిలక్ వర్మ రాకతో భారత తుది జట్టులో సంజూ శాంసన్ అవకాశం కోల్పోనున్నాడు. న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో ఇషాన్ కిషన్ సత్తా చాటడంతో సంజూ బెంచ్‌కే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Story first published: Tuesday, February 3, 2026, 10:54 [IST]
Other articles published on Feb 3, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+