Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: మరికాసేపట్లో భారత్ X శ్రీలంక వామప్ మ్యాచ్.. ఎలా చూడాలంటే?

రెండు టెస్ట్‌ల సిరీస్ కోసం శ్రీలంక పర్యటన‌కు వెళ్లిన భారత జట్టు వామప్ మ్యాచ్‌కు సిద్దమైంది. మరికాసేపట్లో శ్రీలంక ఎలెవన్‌తో కొలంబోలోని ఎన్‌సీసీ మైదానం వేదికగా మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అక్కడి స్పిన్ కండిషన్స్‌ను అలవాటు చేసుకునేందుకు ఈ వామప్ మ్యాచ్‌ను టీమిండియా ఉపయోగించుకోనుంది.

గత మూడేళ్లుగా స్పిన్ బౌలింగ్‌ను ఆడటంలో టీమిండియా ఇబ్బంది పడుతోంది. 2024 నుంచి భారత్ వెస్టిండీస్, బంగ్లాదేశ్‌తో మినహా మరే టెస్ట్ సిరీస్ గెలవలేదు. సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై క్లీన్ స్వీప్ అయ్యింది. దాంతో శ్రీలంక‌తో టెస్ట్ సిరీస్ కీలకంగా మారింది.

India vs Sri Lanka XI Warm-Up Where to Watch Live In India TV Channel and Streaming Details

ఉదయం 10 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. 30 నిమిషాల ముందే టాస్ పడనుంది. భారత్ జట్టులోని 15 మంది ఆటగాళ్ల ఈ సన్నాహక మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నారు. అయితే ఈ మ్యాచ్‌లోని పరుగులు, వికెట్లను అధికారిక గణంకాల్లోకి తీసుకోరు. ఆటగాడు ఎప్పుడైనా ఏ సమయంలోనైనా రిటైర్ కావచ్చు. ఎప్పుడైనా మరో బ్యాటర్ వచ్చి బ్యాటింగ్ చేయవచ్చు. బ్యాటర్ ఔటైన తర్వాత కూడా మళ్లీ వచ్చి బ్యాటింగ్ చేయవచ్చు. అయితే 10 వికెట్లు పడితే మాత్రం ఇన్నింగ్స్ ముగిస్తుంది.

ఈ మ్యాచ్‌కు ముందు శుభ్‌మన్ గిల్ బొటనవేలి గాయినిక గురయ్యాడు. అతను ఆడుతాడా? లేదా అనేది చూడాలి. ఒకవేళ శుభ్‌మన్ గిల్ దూరమైతే వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ జట్టును నడిపిస్తాడు. వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి రిషభ్ పంత్‌ను తప్పించి కేఎల్ రాహుల్‌కు ఇచ్చిన సంగతి తెలిసిందే.

IND vs SL: శ్రీలంక మైండ్‌గేమ్.. వామప్ మ్యాచ్‌‌ పిచ్‌పై టీమిండియా అసంతృప్తి!

IND vs SL: శ్రీలంక మైండ్‌గేమ్.. వామప్ మ్యాచ్‌‌ పిచ్‌పై టీమిండియా అసంతృప్తి!

సోనీ టీవీలో లైవ్..

ఈ సిరీస్‌కు సోనీ టీవీ నెట్‌వర్క్‌ బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్స్‌తో పాటు సోనీ లివ్ ఓటీటీ యాప్‌లో ఈ వామప్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

జట్లు:

భారత్: శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, సరాన్ష్ జైన్, అకిబ్ నబీ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్.

IND vs SL: గాయంతో జస్‌ప్రీత్ బుమ్రా ఔట్.. రేసులో ముగ్గురు పేసర్స్!</a><a class=" width="200" height="113">

Also Read

IND vs SL: గాయంతో జస్‌ప్రీత్ బుమ్రా ఔట్.. రేసులో ముగ్గురు పేసర్స్!

శ్రీలంక ఎలెవన్: సోనాల్ దినుషా (కెప్టెన్), నిషాన్ మదుష్క, నిపున్ ధనంజయ, రవిందు రసంత, పవన్ రత్నాయకే, అహన్ విక్రమసింఘే, రమేష్ మెండిస్, దిలుమ్ సుదీర, విశ్వ ఫెర్నాండో, లహిరు కుమార, పసిందు సూర్యబండార, ఇసిత విజేసుందర, అన్హారవనక బందర, అన్హారవనక బండారు.

Story first published: Friday, August 7, 2026, 9:54 [IST]
Other articles published on Aug 7, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+