India vs Sri Lanka సిరీస్‌లతో కోట్లలో నష్టం.. బీసీసీఐకి ఝలక్ ఇచ్చిన స్టార్ స్పోర్ట్స్!

న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి స్టార్ స్పోర్ట్స్ ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారత్,శ్రీలంక మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్‌లతో స్టార్ స్పోర్ట్స్‌కు కోట్లలో నష్టం వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ద్వైపాక్షిక సిరీస్‌లకు సంబంధించిన యాడ్ ఇన్వెంటరీ అమ్ముడవ్వలేదని, అడ్వర్టైజ్‌మెంట్స్ కోసం కేవలం మూడు, నాలుగు బ్రాండ్స్ మాత్రమే వచ్చాయని ఇన్‌సైడ్ స్పోర్ట్స్ ఓ కథనం ప్రచురిచింది. స్టార్ స్పోర్ట్స్ అధికారే భారత్-శ్రీలంక ద్వైపాక్షిక సిరీస్‌ల ద్వారా రూ.200 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపాడని ఆ కథనంలో పేర్కొంది.

బైజూస్ కూడా..
స్టార్ నెట్‌వర్క్‌కు చెందిన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ హాట్‌స్టార్‌కు అయితే ఒక్క యాడ్ కూడా రాలేదట. దాంతో స్టార్ స్పోర్ట్స్..తమ పూర్తి డీల్‌లో రూ.130 కోట్లు డిస్కౌంట్ అడిగిందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మరోవైపు జెర్సీ స్పాన్సర్, ఎడ్యుకేషనల్ టెకీ సంస్థ బైజూస్ కూడా తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని బీసీసీఐకి సమాచారమిచ్చింది. దాంతో సోమవారం హుటాహుటిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ భేటి అయ్యింది.
ఈ రెండు సమస్యలపై చర్చించింది. అయితే మార్చి 2023 వరకు కొనసాగాలని బైజూస్‌ను బీసీసీఐ కోరినట్లు ఓ అధికారి వెల్లడించారు.

అనవసర ఖర్చు ఎందుకని..
ఒప్పో స్థానంలో దాదాపు రూ.300 కోట్లకు బైజూస్ టీమిండియా జెర్సీ స్పాన్సర్ తీసుకుంది. నవంబర్ 2023 వరకు బైజూస్ కొనసాగాల్సి ఉంది. కానీ మార్కెట్‌లో నెలకొన్ని ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో 2500 మంది ఉద్యోగులను తొలగించిన బైజూస్.. ఖర్చులు తగ్గించుకోవడంపై దృష్టిసారించింది. ఈ క్రమంలోనే జెర్సీ స్పాన్సర్‌షిప్‌ను వదులుకోవాలనుకుంటుంది. ఇప్పటికే ఈ డీల్ బ్యాంక్ గ్యారంటీ కింద రూ.140 కోట్లు బీసీసీఐ చెల్లించిన బైజూస్.. మిగతా 160 కోట్లు ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో పే చేస్తుంది.

అపెక్స్ మీటింగ్‌లో చర్చ..
'బైజూస్, స్టార్ ఇండియాకు సంబంధించిన ఇష్యూలపై అపెక్స్ మీటింగ్‌లో చర్చించాం. దాదాపు గంటపాటు సుదీర్ఘంగా ఆలోచించాం. అయితే తుది నిర్ణయం తీసుకోలేదు. కోట్లతో కూడిన వ్యవహరం కావడంతో ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తుది నిర్ణయానికి మరింత సమయం పట్టవచ్చు.'అని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించాడు. ఇక 2018-23 ఐదేళ్ల కాలానికి సంబంధించిన భారత అంతర్జాతీయ మ్యాచ్‌లు, దేశవాళీ మ్యాచ్‌ల రైట్స్‌కు స్టార్ స్పోర్ట్స్ రూ.6138.1 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ మొత్తం డీల్ నుంచి తమకు రూ.130 కోట్లు డిస్కౌంట్ ఇవ్వాలని స్టార్ నెట్‌వర్క్ బీసీసీఐకి రిక్వెస్ట్ చేసింది.

రీషెడ్యూల్ అవ్వడంతో..
ఈ ఒప్పందంలో భాగంగా జరగాల్సిన కొన్ని మ్యాచ్‌లు కరోనా కారణంగా రిషెడ్యూల్ అయ్యాయని, తమకు నష్టాలు వచ్చాయని స్టార్ నెట్‌వర్క్ పేర్కొన్నట్లు సమాచారం. ఇక ఈ డీల్ మార్చిలో ముగియనుండగా.. స్టార్ నెట్ వర్క్ బకాయి డబ్బులను బీసీసీఐకి చెల్లించలేదు. తదుపరి ఐదేళ్ల సైకిల్ రైట్స్ అమ్మడంపై కూడా బీసీసీఐ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ మీడియా రైట్స్ ద్వారా రూ48390 కోట్లు ఆర్చించిన బీసీసీఐ.. దానికి మించిన డబ్బు రాబట్టాలనే ప్రణాళికలో ఉన్నట్లు తెలుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications