Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: పాపం రుతురాజ్ గైక్వాడ్.. ఒక్క మ్యాచ్ ఆడకుండానే టీ20 సిరీస్ నుంచి ఔట్!

 India vs Sri Lanka: Ruturaj Gaikwad ruled out of T20Is due to wrist injury

న్యూఢిల్లీ: టీమిండియా యువ క్రికెటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ను దురదృష్టం నీడలా వెంటాడుతోంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో సూపర్ బ్యాటింగ్‌తో ఆరెంజ్ క్యాప్ అందుకున్న ఈ సీఎస్‌కే ఓపెనర్‌కు భారత జట్టులో మాత్రం అవకాశం దక్కలేకపోయింది. సౌతాఫ్రికా పర్యటనకు ఎంపికైనా తుది జట్టులో చోటు దక్కలేదు. సొంతగడ్డపై వెస్టిండీస్‌తో సిరీస్‌‌లోనైనా ఆడుతాడాని భావిస్తే.. కరోనా కాటేసింది. చివరకు మూడో టీ20లో అవకాశం వచ్చినా.. క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ఫిట్‌నెస్ సమస్యలతో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇప్పుడు ఆ గాయం తీవ్రత కారణంగా టీ20 సిరీస్‌ నుంచే తప్పుకున్నాడు. రుతురాజ్‌కు కుడిచేయి మణికట్టు గాయం తిరగబెట్టిందని.. బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ అతన్ని పర్యవేక్షిస్తోందన్నారు. గాయం తీవ్రత తేలకపోవడంతో మిగతా మ్యాచ్‌లకు రుతురాజ్‌ దూరమయ్యాడని చెప్పుకొచ్చారు.

రుతురాజ్‌ స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ను జట్టులోకి ఎంపిక చేశామన్నాడు. దాంతో చండీఘడ్‌లో ఉన్న మయాంక్‌ అగర్వాల్ ధర్మశాలలో ఉన్న టీమ్‌తో జాయిన్‌ అయ్యాడు. మయాంక్‌ జట్టుతో కలిసినప్పటికి బయో బబూల్‌లో ఉంటాడని బీసీసీఐ పేర్కొంది. ఇక రుతురాజ్‌కు ఏది కలిసి రావడంలేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

IND vs SL 1st T20I: India’s Predicted Playing XI For First T20I | Oneindia Telugu

ఇప్పటికే గాయాల కారణంగా కేఎల్‌ రాహుల్‌, అక్షర్‌ పటేల్‌, దీపక్‌ చహర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లు భారత జట్టకు దూరమవ్వగా.. తాజాగా వారి జాబితాలో రుతురాజ్ కూడా చేరాడు. ఇక లంకతో తొలి టీ20లో 62 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన టీమిండియా.. నేడు(శనివారం) రెండో టీ20 ఆడనుంది. ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను గెలుచుకోవాలని టీమిండియా భావిస్తోంది. తద్వారా చివరి మ్యాచ్‌లో బెంచ్ బలాన్ని పరీక్షించుకోవాలనుకుంటుంది. టీమిండియా పటిష్టమైన బ్యాటింగ్‌ లైనఫ్‌ను లంక బౌలర్లు ఏ మేరకు నిలువరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. తొలి టీ20లో ఆ జట్టు మూడు విభాగాల్లో దారుణంగా విఫలమైంది.

Story first published: Saturday, February 26, 2022, 10:27 [IST]
Other articles published on Feb 26, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+