IND vs SL: పాపం కేఎల్ రాహుల్.. అంపైర్ ఘోర తప్పిదానికి బలి!

దుబాయ్: ఆసియా కప్ 2022లో అంపైర్ల తప్పిదాలు కొనసాగుతున్నాయి. శ్రీలంక-అఫ్గానిస్థాన్ మధ్య జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే ఘోర తప్పిదంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న అంపైర్లు.. భారత్ X శ్రీలంక మ్యాచ్‌లోనూ అదే పని చేశారు. థర్డ్ గ్రేడ్ అంపైరింగ్‌తో అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. అంపైర్ల తప్పుడు నిర్ణయం కారణంగా టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ బలయ్యాడు. ఈ నిర్ణయాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేకపోయిన రాహుల్.. మైదానంలోనే అంపైర్‌పై అసహనం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది.
అసలేం జరిగిందంటే..?
మహీశ్ తీక్షణ వేసిన రెండో ఓవర్ ఐదో బంతిని రాహుల్ స్టెప్ ఔటై భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని అంచనా వేయడంలో రాహుల్ విఫలమవడంతో అది అతని కాలును తాకింది. దాంతో లంక ఆటగాళ్లు అప్పీలు చేయగా అంపైర్ ఔటిచ్చాడు. బంతి బ్యాట్‌కు తగిలిందనే కాన్ఫిడెంట్‌తో రాహుల్ రివ్యూ తీసుకున్నాడు. రిప్లేను పలు కోణాల్లో పరిశీలించిన థర్డ్ అంపైర్ బ్యాట్‌ను తాకినట్లు స్పష్టమైన ఆధారం లేదని ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి కట్టుబడి ఔటిచ్చాడు. అయితే రిప్లేలో బంతి బ్యాట్‌ను ముద్దాడుతునే అతని షూకు తగిలింది. అయినా అంపైర్ ఔటివ్వడంపై రాహుల్ అసహనం వ్యక్తం చేస్తూ మైదానం వీడాడు.
ఫ్యాన్స్ ఫైర్..
థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది ఎలా ఔటో చెప్పాలని నిలదీస్తున్నారు. బ్యాట్‌ను తాకినట్లు అల్ట్రా ఎడ్జ్‌లో స్పష్టంగా కనబడుతుంటే ఆధారం లేదని చెప్పడం ఏందని మండిపడుతున్నారు. ఈ వికెట్‌కు సంబంధించిన అల్ట్రాఎడ్జ్ ఫొటోలను షేర్ చేస్తూ.. థర్డ్ క్లాస్ అంపైరింగ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. వెంటనే థర్డ్ అంపైర్‌పై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేస్తున్నారు.
విరాట్ కోహ్లీ డకౌట్..
రాహుల్ ఔటైన అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. దిల్లాన్ మధుషంక వేసిన మూడో ఓవర్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. భారీ షాట్ ఆడే క్రమంలో బంతిని అంచనా వేయడంలో విఫలమైన కోహ్లీ మూల్యం చెల్లించుకున్నాడు. దాంతో భారత్ 13 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి రోహిత్ శర్మ జట్టును ఆదుకున్నాడు. సూపర్ బ్యాటింగ్‌తో 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని.. జట్టును భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తాడు. దాంతో 10 ఓవర్లలో టీమిండియా 2 వికెట్లకు 79 పరుగులు చేసింది.

- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+

Click it and Unblock the Notifications