IND vs SL Dream11: టీమిండియాకు కరోనా సెగ.. రెండో టీ20 బరిలోకి దిగే జట్లు! ఫాంటసీ టిప్స్ ఇవే!

కొలంబో: శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌లో శుభారంభం చేసిన భారత జట్టుకు కరోనా సెగ తగిలింది. టీమ్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా మంగళవారం కరోనా వైరస్ బారిన పడ్డాడు. రెండో టి20 మరికొన్ని గంటల్లో ఆరంభమవుతుందనగా కృనాల్‌కు కోవిడ్-19 అని తేలడంతో మ్యాచ్ నేటి(బుధవారానికి) వాయిదా పడింది. కృనాల్‌తో ఎనిమిది మంది క్రికెటర్లు సన్నిహితంగా మెలిగినట్లు భారత మెడికల్ టీమ్ గుర్తించింది. వీరికి ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్‌గా రిపోర్టు వచ్చింది. అయితే వీరు కూడా మిగిలిన రెండు మ్యాచులకు దూరం కానున్నట్లు సమాచారం. వీరి పేర్లను మాత్రం గోప్యంగా ఉంచారు.
టీ20 ప్రపంచకప్ ముంగిట జరుగుతున్న ఏకైక సిరీస్ ఇదే కావడంతో ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇక తొలి టీ20 పరాజయానికి బదులు తీర్చుకోవాలని ఆతిథ్య లంక ఇదే అదునుగా భావిస్తోంది. బలహీనమైన భారత్‌పై పై చేయి సాధించి తమకు చావో రేవో అయిన ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ ఆశలను నిలుపుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది.

జట్టులో భారీ మార్పులు!
తనకు కాస్త గొంతు నొప్పిగా ఉందంటూ మంగళవారం ఉదయం కృనాల్ భారత మెడికల్ టీమ్‌కు తెలియజేశాడు. వెంటనే అప్రమత్తమైన మెడికల్ సిబ్బంది అతడికి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టును నిర్వహించింది. అందులో కృనాల్ పాజిటివ్‌గా తేలాడు. మిగతా ఆటగాళ్లందరికీ పరీక్షలు చేయించగా.. నెగటీవ్ వచ్చింది. అయితే సన్నిహితంగా ఉన్న 8 మందిని ఆడిస్తారా? లేదా? అనేదానిపై స్పష్టత లేదు. మరోవైపు ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికైన సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షా ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో తుది జట్టును అంచనా వేయడం కష్టం. ఎందుకంటే 8 మంది ప్లేయర్లు ఎవరో తెలియదు. ఒకవేళ వారిని అనుమతిస్తే మాత్రం కృనాల్ ప్లేస్ గౌతమ్ ఒక్కడు రానున్నాడు.

భారత తుది జట్టు అంచనా
శిఖర్ ధావన్, పృథ్వీ షా, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, కృష్ణప్ప గౌతమ్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, యుజువేంద్ర చాహల్, వరుణ్ చక్రవర్తీ

రాజపక్సకు చోటు..
శ్రీలంక జట్టులో కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందరికి నెగటీవ్ వచ్చింది. తొలి టీ20లో బౌలింగ్‌లో అదరగొట్టిన ఆ జట్టు బ్యాటింగ్‌లో మాత్రం చేతులెత్తేసింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అయితే ఆ జట్టులో కూడా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. అవిష్కా ఫెర్నాండో, మినోద్ భానుక ఓపెనర్లుగా బరిలోకి దిగనుండగా.. ధనుంజయ, చరిత్ అసలంక, తర్వాత రానున్నారు. అరంగేట్ర ప్లేయర్ అశేన్ బండారాకు మరో అవకాశం ఇవ్వవచ్చు. లేకుంటే భానుక రాజపక్సకు అవకాశం ఇవ్వవచ్చు. బౌలింగ్‌లో విభాగంలో కూడా పెద్దగా మార్పలు ఉండకపోవచ్చు. ఇసురు ఉడానా, హసరంగా, దుష్మంత చమీరా, అకిలా ధనుంజయ బరిలోకి దిగనున్నారు.

శ్రీలంక తుది జట్టు అంచనా
అవిష్కా ఫెర్నాండో, మినోద్ భానుక(కీపర్), ధనంజయ డిసిల్వా, చరిత్ అసలంక, అషెన్ బండారా/భానుక రాజపక్స, డసన్ షనక, వానిండు హసరంగ, చమిక కరుణరత్న/ఇసురు ఉడానా, దుష్మంత చమీరా, అకిలా ధనుంజయ

డ్రీమ్ 11 ప్రిడిక్షన్/ ఫాంటసీ టీమ్
వికెట్ కీపర్: ఇషాన్ కిషన్
బ్యాట్స్‌మన్: సూర్యకుమార్ యాదవ్, శిఖర్ ధావన్, పృథ్వీ షా, అవిష్కా ఫెర్నాండో
ఆల్‌రౌండర్స్: ధనుంజయ డిసిల్వా, చమిక కరుణరత్నే, హార్దిక్ పాండ్యా
బౌలర్లు: దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్, దుష్మంత్ చమీరా
కెప్టెన్/వైస్ కెప్టెన్ ఆప్షన్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, సూర్యకుమార్ యాదవ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications