IND vs SL Dream11:తొలి టీ20 బరిలోకి దిగే జట్లు! ఫాంటసీ టిప్స్ ఇవే!కెప్టెన్, వైస్ కెప్టెన్‌గా సూర్య, పృథ్వీషా!

కొలంబో: శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న భారత్ జట్టు టీ20 సిరీస్‌పై కన్నేసింది. ఆదివారం రాత్రి జరిగే తొలి టీ20 మ్యాచ్‌తో ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు తెరలేవనుండగా.. గెలుపే లక్ష్యంగా గబ్బర్ సేన బరిలోకి దిగనుంది. టీ20 ప్రపంచకప్ ముంగిట జరుగుతున్న ఏకైక సిరీస్ ఇదే కావడంతో ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. మెగా టోర్నీ ముందు తమ ఆటగాళ్ల సత్తాను టీమిండియా పరీక్షించనుండగా.. చివరి వన్డే విజయంతో ఆత్మవిశ్వాసం పెంచుకున్న లంక టీ20 సిరీస్ గెలిచి లెక్క సరిచేయాలని భావిస్తోంది.

జట్టులో మార్పులు జరిగేనా?
గత మ్యాచ్‌లోనే ప్రయోగాలకు వెళ్లి మూల్యం చెల్లించుకున్న టీమిండియా తొలి టీ20లో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తారా? లేక వన్డే సిరీస్‌లో కొనసాగించినా జట్టునే కొనసాగిస్తారా? అనేది చూడాలి. ఓపెనర్లుగా పృథ్వీషా, శిఖర్ ధావన్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌కు అవకాశం దక్కవచ్చు. సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా మిడిలార్డర్‌లో రానున్నారు. కృనాల్ పాండ్యా, దీపక్ చాహర్, భువనేశ్వర్, యుజ్వేంద్ర చాహల్ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే వన్డే సిరీస్‌లో విఫలమైన మనీశ్ పాండేకు మళ్లీ అవకాశం ఇస్తారా? అనేది చూడాలి. ఎక్స్‌ట్రా స్పిన్నర్‌ను తీసుకోవాలనుకుంటే మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీకి అవకాశం దక్కవచ్చు. పేసర్ కావాలనుకుంటే చేతన్ సకారియాను
ఆడించవచ్చు.

భారత తుది జట్టు అంచనా:
శిఖర్ ధావన్, పృథ్వీ షా, సంజూ శాంసన్/ఇషాన్ కిషన్, మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, యుజువేంద్ర చాహల్, చేతన్ సకారియా/వరుణ్ చక్రవర్తీ

హసరంగా ఔట్..
శ్రీలంక జట్టులో అద్భుత ప్రదర్శన కనబర్చిన స్పిన్నర్ వానిందు హసరంగా టీ20 సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అతను మజిల్ టియర్ గాయంతో మూడో వన్డేకు దూరమయ్యాడు. వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న శ్రీలంక సీనియర్ ప్లేయర్లు నిరోషన్ డిక్‌వెల్లా, ఇసురు ఉడానా, పాతమ్ నిస్సంక టీ20 సిరీస్ బరిలోకి దిగనున్నారు. అవిష్కా ఫెర్నాండో, మినోద్ భానుక, భానుక రాజపక్స మంచి ఫామ్‌లో ఉన్నారు.

శ్రీలంక తుది జట్టు అంచనా:
అవిష్కా ఫెర్నాండో, మినోద్ భానుక(కీపర్), భానుక రాజపక్స/నిరోషన్ డిక్‌వెల్లా, ధనంజయ డిసిల్వా, చరిత్ అసలంక, డసన్ షనక, చమిక కరుణరత్నే, దుష్మంత చమీరా, లక్షన్ సందకన్, కసున్ రజిత/ఇసురు ఉడానా

డ్రీమ్ 11 ప్రిడిక్షన్/ ఫాంటసీ టీమ్
వికెట్ కీపర్: సంజూ శాంసన్
బ్యాట్స్‌మన్: సూర్యకుమార్ యాదవ్, శిఖర్ ధావన్, పృథ్వీ షా, డసన్ షనక, అవిష్కా ఫెర్నాండో
ఆల్‌రౌండర్స్: ధనుంజయ డిసిల్వా, చమిక కరుణరత్నే
బౌలర్లు: దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్, దుష్మంత్ చమీరా
కెప్టెన్/వైస్ కెప్టెన్ ఆప్షన్స్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, సూర్యకుమార్ యాదవ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications