India vs Sri Lanka: లంక ఆటగాళ్లందరికి నెగటీవ్.. సోమవారం బయోబబుల్‌లోకి!

న్యూఢిల్లీ: టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్ నేపథ్యంలో శ్రీలంక జట్టు ఆటగాళ్లందరికీ నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. ఇంగ్లండ్ పర్యటన ముగించుకొని స్వదేశానికి చేరుకున్న శ్రీలంక జట్టులో బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్‌తో పాటు డేటా అనలిస్టు నీరోషన్‌కు పాజిటీవ్ వచ్చిన విషయం తెలిసిందే. 48 గంటల వ్యవధిలోనే ఈ ఇద్దరూ వైరస్ బారిన పడటంతో అప్రమత్తమైన లంక బోర్డు ఆటగాళ్లందరిని కఠిన క్వారంటైన్‌లోకి పంపించింది.
భారత్‌తో జరగాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్‌లను రీ షెడ్యూల్ చేసింది. అయితే తాజాగా ఆటగాళ్లకు నిర్వహించిన ఆర్టీ-పీసీఆర్ పరీక్షల్లో అందరికీ నెగిటివ్ వచ్చిందని శ్రీలంక బోర్డుకు చెందిన అధికారి ఒకరు ప్రముఖ వార్త సంస్థ 'పీటీఐ'కి తెలిపాడు. సోమవారం వారిని బయోబుడగలోకి అనుమతించే అవకాశం కూడా ఉందన్నాడు.

అందరికీ నెగటీవ్..
'మా ఆటగాళ్లకు ఎవరికైనా పాజిటివ్ రిపోర్టు వస్తే వెంటనే మేం బయటకు తెలియజేస్తాం. నిన్న వారికి మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించగా ఆ ఫలితాలు ఈ రోజు రావాల్సి ఉంది. అయితే, పాజిటివ్ కేసులుంటేనే మాకు రిపోర్టులు వస్తాయి. ఇప్పటికైతే ఎలాంటి రిపోర్టులు అందలేదు. కాబట్టి, అందరికీ నెగిటివ్ వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. అంతా సవ్యంగా సాగితే యూకే నుంచి వచ్చిన ఆటగాళ్లు కఠిన క్వారంటైన్ నుంచి బయటకు వచ్చి బయోబుడగలోకి ప్రవేశిస్తారు. అలాగే వారికి నిబంధనల ప్రకారం ప్రతి మూడు, ఐదు రోజులకోసారి కరోనా పరీక్షలు జరుగుతూ ఉంటాయి' అని ఆ అధికారి పేర్కొన్నాడు.

ఆ ఇద్దరికీ లక్షణాల్లేవ్..
ఇక పాజిటివ్‌గా తేలిన గ్రాంట్‌ఫ్లవర్, నీరోషన్ ఆరోగ్యం గురించి ప్రశ్నించగా.. వాళ్లు బాగున్నారని, నిబంధనల ప్రకారం.. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారని చెప్పారు. ఇప్పుడు వాళ్లిద్దరూ లక్షణాలు లేకుండా ఉన్నారన్నారు. త్వరలోనే ఐసోలేషన్‌ను ముగించుకొని పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తారని తెలిపాడు. ఇక టీమిండియాతో 18 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు ముందు ఎలాంటి అడ్డంకులు ఉండబోవని సదరు అధికారి విశ్వాసం వ్యక్తం చేశాడు.

సిరీస్‌లు రీషెడ్యూల్..
కరోనా దెబ్బతో భారత్-శ్రీలంక మధ్య జరగాల్సిన వన్డే, టీ20 సిరీస్‌లు రీ షెడ్యూల్ చేశారు. ఈ నెల 18 నుంచి జరిగే వన్డే సిరీస్‌తో ఈ పర్యటన ప్రారంభమవుతుందని బీసీసీఐ సెక్రటరీ జైషా శనివారం ప్రకటించారు. వాస్తవానికి ఈ నెల 13 నుంచే వన్డే సిరీస్ ప్రారంభం కావాల్సి ఉండగా.. శ్రీలంక జట్టులో వెలుగు చూసిన కరోనా కేసులతో ఐదు రోజుల పాటు వాయిదా వేసారు.
ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకునే షెడ్యూల్‌లో మార్పులు చేసినట్టు జైషా చెప్పారు. 'ఈ కష్టకాలంలో సిరీస్ సాఫీగా సాగేలా శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ)కి బీసీసీఐ పూర్తి సహకారం అందిస్తుంది. సిరీస్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని రకాల సేఫ్టీ ప్రొటోకాల్స్ పాటించే విషయంలో ఎస్‌ఎల్‌సీ డాక్టర్ల టీమ్‌తో మా మెడికల్ టీమ్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. రాబోయే రోజుల్లో రెండు దేశాలూ చాలా ఉత్సాహంగా ఆడుతాయని, ఉత్తేజకరమైన క్రికెట్‌ను చూస్తామని మేం నమ్మకంగా ఉన్నాం'అని జైషా పేర్కొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications