Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Sri Lanka మూడో టీ20‌ టాస్ ఆలస్యం.. ఎందుకంటే?

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య జరగాల్సిన చివరి మ్యాచ్‌ ఇంకా ప్రారంభం కాలేదు. షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ 7 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. ఇంకా టాస్ కూడా వేయలేదు. మ్యాచ్ ప్రారంభానికి ముందు భారీ వర్షం రావడంతో మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. దాంతో అంపైర్లు ఇంకా టాస్ వేయలేదు.

ప్రస్తుతం వర్షం ఆగిపోగా.. కవర్లను తొలగించిన గ్రౌండ్స్‌మెన్ మైదానాన్ని ఆటకు సిద్దం చేస్తున్నారు. పిచ్‌తో పాటు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు రాత్రి 7.40 గంటలకు టాస్ వేసి.. 8 గంటలకు మ్యాచ్ ప్రారంభిస్తామని తెలిపారు.

ind vs sl

ఇప్పటికే ఈ సిరీస్‌ను టీమిండియా 2-0తో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రెండో టీ20కి వర్షం అంతరాయం కలిగించగా.. మ్యాచ్ ఫలితాన్ని డక్ వర్త్ లూయిస్ పద్దతిన తేల్చారు. ఓవర్లతో పాటు భారత్ లక్ష్యాన్ని కుదించారు. సిరీస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో టీమిండియా.. తమ బెంచ్ బలాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంది. వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్‌లకు తుది జట్టులో చోటు దక్కవచ్చు.

మెడనొప్పితో రెండో టీ20కు దూరమైన శుభ్‌మన్ గిల్‌ ఆఖరి టీ20కి అందుబాటులోకి రానున్నాడు. రిషబ్ పంత్‌ స్థానంలో శాంసన్ జట్టులో కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు ఆతిథ్య జట్టు శ్రీలంక ఈ మ్యాచ్‌ను చాలా సీరియస్‌‌గా తీసుకుంది. భారత్‌కు క్లీన్ స్వీప్ ఛాన్స్ ఇవ్వకూడదని, పరువు నిలుపుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.

భారత తుది జట్టు(అంచనా)
శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), సంజు శాంసన్/రిషభ్ పంత్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్య/శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఖలీల్ అహ్మద్, మహమ్మద్ సిరాజ్.

Story first published: Tuesday, July 30, 2024, 19:21 [IST]
Other articles published on Jul 30, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+