
చహల్ ఆరు వికెట్లు తీస్తే
మణికట్టు మాంత్రికుడు యజ్వేంద్ర చహల్ రెండో వన్డే మ్యాచ్‌లో ఆరు వికెట్లు తీస్తే.. వన్డే క్రికెట్‌లో 100 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. దీంతో తక్కువ మ్యాచ్‌ల్లో 100 వికెట్ల ఫీట్ అందుకున్న బౌలర్‌గా చహల్ నిలుస్తాడు. టీమిండియా పేసర్ మొహ్మద్ షమీ 56 మ్యాచ్‌ల్లో వంద వికెట్ల మైలురాయిని అందుకోగా.. చహల్ కూడా ప్రస్తుతం 56వ మ్యాచ్ ఆడనున్నాడు. చహల్ తన మాయాజాలం ప్రదర్శిస్తే ఈ రికార్డు పెద్ద కష్టమేమీ కాదు. ఇదే మ్యాచ్‌లో వెటరన్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ రికార్డును కూడా చహల్ అందుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో యూజీ ఐదు వికెట్ల ఫీట్ అందుకుంటే.. హర్భజన్‌తో సమానంగా వన్డేల్లో మూడు సార్లు ఐదు వికెట్ల హాల్ అందుకున్న ఆటగాడిగా నిలవనున్నాడు.
Tokyo Olympics 2021: అథ్లెట్లకు భారీ షాక్.. కరోనా వచ్చిందో ఇక అంతే సంగతులు!!

కుల్దీప్ మరొక వికెట్ తీస్తే
టీమిండియా మరో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను కూడా ఒక రికార్డు ఊరిస్తోంది. ఇప్పటివరకు వన్డేల్లో 107 వికెట్లు తీసిన కుల్దీప్.. మరొక వికెట్ తీస్తే జస్ప్రీత్ బుమ్రా సరసన చేరనున్నాడు. బుమ్రా 67 వన్డేల్లో 108 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ 64 వన్డేల్లోనే 107 వికెట్లు తీశాడు. ఇక ఈ రోజు జరిగే మ్యాచులో మూడు వికెట్లు తీస్తే యువరాజ్ సింగ్‌లతో కుల్దీప్ సమానం కానున్నాడు. యువీ 304 వన్డేల్లో 111 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. కుల్దీప్ గత కొంత కాలంగా పేలవ ప్రదర్శనతో జట్టులో చోటు కోల్పోయాడు. నిజం చెప్పేలంటే.. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ జట్టుకు దూరమయ్యాక, కుల్దీప్ కూడా దూరమయ్యాడు. ఇటీవల పలు పర్యటనలకు ఎంపికయినా.. తుది జట్టులో మాత్రం అతడికి చోటు దక్కడం లేదు.

చివరిసారి ప్రపంచకప్‌లో
తెల్ల బంతి ఫార్మాట్‌లో కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్ రెగ్యులర్‌గా ఆడేవాళ్లు. ఈ ద్వయంతో భారత్ ఎన్నో విజయాలను అందుకుంది. వారి భాగస్వామ్యాన్ని అభిమానులు 'కుల్-చా' అని కూడా పిలుచుకునే వారు. చివరిసారిగా ఈ జోడి 2019 జూన్ మాసంలో ఇంగ్లండ్ జట్టుపై కలిసి ఆడారు. ఆ మ్యాచులో చహల్ తన 10 ఓవర్లలో 88 పరుగులు ఇవ్వగా.. కుల్దీప్ 72 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ఆపై కుల్దీప్ జట్టులో చోటు కోల్పోయాడు. గత రెండు సంవత్సరాలుగా పేలవ ప్రదర్శనతో తుది జట్టులోకి రావడం లేదు. చివరకు లంకపై ఇద్దరూ కలిసి మ్యాచ్ ఆడారు.


Click it and Unblock the Notifications
