For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Sri Lanka Dream11: రెండో వన్డే టిప్స్.. కెప్టెన్‌, వైస్ కెప్టెన్‌గా శిఖర్ ధావన్, పృథ్వీషా!

India vs Sri Lanka Dream11 and Playing 11 Prediction, Captain, Vice-Captain, Fantasy Tips for Ind vs SL 2nd ODI Match
India vs Sri Lanka 2nd ODI: Predicted Playing XI | Oneindia Telugu

హైదరాబాద్: ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగినా ఊహించినట్టుగానే భారత జట్టు దుమ్ములేపింది. అగ్రశ్రేణి ఆటగాళ్ల గైర్హాజరీలో డీలాపడ్డ శ్రీలంకపై తొలి వన్డేలో ఘనవిజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో ఆదివారం జరిగిన తొలి వన్డేలో శిఖర్‌ ధావన్‌ నాయకత్వంలోని టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. 6 మ్యాచ్‌ల పర్యటనను ఘనంగా ఆరంభించింది. మంగళవారం ప్రేమదాస స్టేడియంలోనే రెండో వన్డే జరగనుంది. తొలి మ్యాచ్ ఫలితం తర్వాత రెండో వన్డేలో ఇరు జట్లలో జరిగే మార్పులు.. డ్రీమ్ 11 టిప్స్ గురించి తెలుసుకుందా.

దుమ్మురేపిన యువ ఆటగాళ్లు..

దుమ్మురేపిన యువ ఆటగాళ్లు..

ముందుగా ఊహించనట్లుగా భారత యువ ఆటగాళ్లు దుమ్ములేపారు. వచ్చిరావడంతోనే భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. బర్త్‌డే బాయ్ ఇషాన్ కిషన్ (42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 59) తన అరంగేట్ర వన్డేలో హాఫ్ సెంచరీతో రాణించాడు. ఓపెనర్ పృథ్వీ షా (24 బంతుల్లో 9 ఫోర్లతో 43) సెహ్వాగ్‌ను తలపిస్తూ మెరుపులు మెరిపించారు.

కెప్టెన్ శిఖర్ ధావన్(95 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 86 నాటౌట్‌) బాధ్యతాయు ఇన్నింగ్స్ ఆడుతూ చివరి వరకు క్రీజులో ఉండి జట్టుకు విజయాన్ని అందించాడు. చాలా కాలం తర్వాత బరిలోకి దిగిన స్పిన్నర్లు కుల్దీప్, చాహల్ రెండేసి వికెట్లతో అదరగొట్టారు. పేసర్ భువనేశ్వర్ వికెట్లు తీయకపోయినా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తూ నిలకడగా రాణించాడు. ఇతర ఆటగాళ్లు సైతం పర్వాలేదనిపించారు.

ఇండియా టీమ్ న్యూస్..

ఇండియా టీమ్ న్యూస్..

సమష్టిగా ఆటగాళ్లంతా రాణించడంతో రెండో వన్డేలో టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి వన్డే మాదిరే బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ బరిలోకి దిగనుంది. శిఖర్ ధావన్, పృథ్వీషా ఇన్నింగ్స్ ప్రారంభిస్తే.. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ రానున్నాడు. ఆ తర్వాత మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా మిడిలార్డ్‌లో ఆడనున్నారు. కృనాల్‌తో కలిసి కుల్చా జోడీ స్పిన్ బాధ్యతలు మోయనుంది. భువీ, దీపక్ చాహర్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.

తుది జట్టు (అంచనా)

శిఖర్ ధావన్(కెప్టెన్), పృథ్వీ షా, ఇషాన్ కిషన్(కీపర్), మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్

శ్రీలంక టీమ్ న్యూస్..

శ్రీలంక టీమ్ న్యూస్..

ఇంగ్లండ్ పర్యటనతో పోలిస్తే శ్రీలంక టీమ్ ఈ మ్యాచ్‌లో ఎంతో మెరుగ్గా కనిపించింది. బ్యాట్స్‌మెన్ సైతం మంచి ఆరంభాన్నే అందించారు. కాకపోతే లాంగ్ ఇన్నింగ్స్‌లో ఆడటంలో విఫలమయ్యారు. ఇక బౌలింగ్‌లో పేలవ ఫీల్డింగ్‌తో మూల్యం చెల్లించుకున్నారు. ఇషాన్ కిషన్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌లను పలుమార్లు వదిలేశారు. ఇదే వారి ఓటమికి కారణమైంది. శ్రీలంక జట్టు కూడా మార్పులు లేకుండానే రెండో వన్డేలో బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి వన్డే మాదిరే బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ ఉండనుంది.

తుది జట్టు (అంచనా)

అవిష్కా ఫెర్నాండో, మినోద్ భానుక(కీపర్), భానుక రాజపక్స, ధనుంజయ డిసిల్వా, చరిత్ అసలంక, డసన్ షనక(కెప్టెన్), వానిందు హసరంగ, చమిక కరుణరత్నే, ఇసురు ఉడానా, దుష్మంత చమీరా, లక్షన్ సందకన్

డ్రీమ్ 11 ప్రిడిక్షన్

డ్రీమ్ 11 ప్రిడిక్షన్

వికెట్ కీపర్ ఆప్షన్స్: ఇషాన్ కిషన్, మినోద్ భానుక

బ్యాట్స్‌మన్: పృథ్వీ షా, శిఖర్ ధావన్, అవిష్కా ఫెర్నాండో, డసన్ షనక

ఆల్‌రౌండర్స్: హసరంగ, డి సిల్వా

బౌలర్స్: కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్

కెప్టెన్, వైస్ కెప్టెన్ ఆప్షన్స్: శిఖర్ ధావన్, పృథ్వీ షా, డసన్ షనక, ఇషాన్ కిషన్

మైకేల్ డ్రీమ్ 11 టీమ్: ఇషాన్ కిషన్(కీపర్), శిఖర్ ధావన్ (కెప్టెన్), పృథ్వీ షా (వైస్ కెప్టెన్), డసన్ షనక, అవిష్కా ఫెర్నాండో, ధనుంజయ డిసిల్వా, హసరంగ, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, చాహల్, కుల్దీప్

Story first published: Monday, July 19, 2021, 13:39 [IST]
Other articles published on Jul 19, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+