టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్.. మరి కెప్టెన్ ఎవరు? రేసులో అయ్యర్, ధావన్!!

ముంబై: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్, ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జంబో జట్టు ఈ నెలాఖరులో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇందుకు సంబంధించి 24 మందితో కూడిన జట్టును బీసీసీఐ కొన్ని రోజుల కింద ప్రకటించిన విషయం తెలిసిందే. జూన్ 18-22 మధ్య న్యూజిలాండ్‌తో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసాక భారత్ అక్కడే ఉండి కొన్ని వార్మప్ మ్యాచ్‌లు అనంతరం.. ఆగస్టులో ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్ సిరీస్ గ్యాప్‌లో బీసీసీఐ మరో టూర్‌ను ప్లాన్ చేసింది. టీ20 ప్రపంచకప్‌కు సన్నాహకంగా గతేడాది వాయిదా పడిన శ్రీలంక పర్యటనను తెరమీదకు తీసుకొచ్చింది.

కోచ్‌గా రాహుల్ ద్రవిడ్
శ్రీలంక పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనుండడంతో.. శ్రీలంక పర్యటనకు మరో భారత జట్టు (ఇండియా-బి టీమ్)ను బీసీసీఐ పంపనుంది. ప్రధాన జట్టులో చోటు దక్కని సీనియర్లు, ఐపీఎల్‌లో సత్తా చాటిన యువ ఆటగాళ్లతో ఓ జట్టును బీసీసీఐ ఎంపిక చేయనుంది.
ప్రధాన జట్టుతో పాటే చీఫ్ కోచ్ రవిశాస్త్రి, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ ఇంగ్లండ్ వెళ్లబోతున్నారు. దాంతో లంక వెళ్లే జట్టుకి టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. లంక టూర్‌కి కోచ్‌గా వ్యవహరించమని బీసీసీఐ ద్రవిడ్‌ని కోరినట్లు తెలుస్తోంది. ద్రవిడ్‌తో పాటు ఎన్‌సీఏలోని సపోర్ట్ స్టాఫ్ కూడా లంకకి వెళ్లేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం.

కెప్టెన్ రేసులో అయ్యర్, ధావన్
లంక పర్యటనకు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ వెళ్లడం ఖాయం అయినా.. కెప్టెన్ ఎవరనేది మాత్రం తెలియాల్సి ఉంది. కెప్టెన్ రేసులో టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్.. యువ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు. ఐపీఎల్ టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సారథ్యం వహించిన అయ్యర్‌కు జట్టు పగ్గాలు దక్కే అవకాశం ఉంది.
అయితే అతడు గాయం నుంచి కోలుకోవాల్సి ఉంది. శిఖర్ ధావన్, పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, మనీశ్ పాండే, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, యుజ్వేంద్ర చహల్, రాహుల్ చహర్, రాహుల్ తెవాటియాలు లంక వెళ్లే అవకాశం ఉంది.
IPL 2021 మిగతా సీజన్‌కు వాళ్లు దూరం.. కోల్‌కతా, రాజస్థాన్, చెన్నై జట్లకు షాక్!!

జూలై 5న శ్రీలంకకు
బోర్డుల సమాచారం ప్రకారం భారత జట్టు జూలై 5న శ్రీలంకలో అడుగుపెట్టి.. 28న తిరుగు పయనంకానుంది. ఆతిథ్య శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20లు భారత్ ఆడనుంది. జూలై 13, 16, 19 తేదీల్లో వరుసగా మూడు వన్డేలు జరగనుండగా.. జూలై 22, 24, 27 తేదీల్లో మూడు టీ20ల సిరీస్ జరగనుంది.
అయితే కఠిన బయో బబుల్ నేపథ్యంలో ఈ సిరీస్‌లు ప్రేక్షకుల్లేకుండానే జరగనున్నాయి. 2018 నిదహాస్ తర్వాత భారత్ తొలిసారి శ్రీలంకలో పర్యటిస్తుండటంతో ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. ఈ పర్యటనకు బయలుదేరే సమయానికి ఆటగాళ్లందరికి వ్యాక్సినేషన్ పూర్తి చేయనున్నారు. దాంతో వీరంతా లంకలో మూడు రోజులు హార్డ్ క్వారంటైన్.. మరో నాలుగు రోజులు సాఫ్ట్ క్వారంటైన్‌లో ఉండనున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications