India vs Sri Lanka: ప్చ్.. తొలి వన్డేకు వర్ష గండం! మ్యాచ్ ఎన్ని గంటలకంటే..?

కొలంబో: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, శ్రీలంక సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. హోమ్ టీమ్‌లో కరోనా కేసులు వెలుగు చూడటంతో.. ఐదు రోజులు ఆలస్యంగా ఈ సిరీస్‌ను మొదలుపెడుతున్నారు. దీంతో ప్రేమదాస స్టేడియంలో ఇరు జట్ల మధ్య నేడు( ఆదివారం) జరిగే ఫస్ట్ వన్డేతో సిరీస్‌కు తెరలేవనుంది.
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో రెండు జట్లు ఈ సిరీస్‌కు చాలా ప్రాధాన్యమిస్తున్నాయి. సిరీస్ గెలిచి కాన్ఫిడెన్స్‌ను పెంచుకోవాలని టార్గెట్‌గా పెట్టుకున్నాయి. అయితే ఇరు జట్లలో కుర్రాళ్లు మంచి జోరు మీదుంటం, కొత్త కెప్టెన్లుగా శిఖర్ ధావన్.. షనక టీమ్స్‌ను ఎలా నడిపిస్తారన్న ఆసక్తి అందరిలో మొదలైంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్ష గండం పొంచి ఉండటమే అభిమానులను కలవరపెడుతోంది.

వెదర్ రిపోర్ట్..
ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. వర్షం కురవడానికి 20 శాతం అవకాశం ఉందని లంక వాతవారణ శాఖ అంచనా వేసింది. కొలంబోలో ఉక్కపోత వాతవారణం నెలకొందని, సగటు ఉష్ణోగ్రత 29 డిగ్రీస్ సెల్సియస్‌గా నమోదైందని పేర్కొంది. వర్షం కారణంగా మ్యాచ్‌కు జరిగే నష్టం పెద్దగా ఉండదని తెలిపింది. కానీ వర్షం అంతరాయం కలిగిస్తే ఫలితంపై ప్రభావం ఉంటుందని అభిమానులు కలవరపడుతున్నారు.

మ్యాచ్ టైమింగ్స్..
మధ్యాహ్నం 3 గంటలకు భారత్ X శ్రీలంక తొలి వన్డే కొలంబోలోని ప్రేమదాసు స్టేడియం వేదికగా ప్రారంభం కానుంది. సోనీ టెన్-1లో మ్యాచ్ ప్రత్యక్షప్రసారం కానుంది. అంతేకాకుండా సోనీ రిజినల్ లాంగ్వేజెస్ చానల్స్‌లో కూడా మ్యాచ్ రానుంది. ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్ సోనీలివ్ కూడా మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

పిచ్ రిపోర్టు
ప్రేమదాస స్డేడియంలో 2019లో చివరిగా వన్డే జరిగింది. భారత్-శ్రీలంక మధ్య నేడు జరిగేది 131వ మ్యాచ్. ఈ పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలం. ఇక్కడ ఎప్పుడైనా భారీ స్కోర్లు నమోదవుతుంటాయి. ఈ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 71 సార్లు గెలిచాయి. చేజింగ్ చేసిన జట్లు 50 సార్లు గెలుపొందాయి. 10 మ్యాచుల్లో ఫలితం తేలలేదు. అయితే ఈ మైదానం స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. కొత్త బంతితో పేసర్ల ప్రభావం ఉంటుంది. టాస్ గెలిచిన జట్లు బ్యాటింగ్‌కు మొగ్గు చూపే అవకాశమే ఎక్కువ.

ప్రిడిక్షన్..
ఈ మ్యాచ్‌లో విజయవకాశాలు భారత్‌కే ఎక్కువగా ఉన్నాయి. శిఖర్ ధావన్ సేన పేపర్‌పై చాలా బలంగా ఉంది. పైగా ప్రత్యర్థి తీవ్ర ఒత్తిడిలో ఉంది. సీనియర్ ఆటగాళ్ల గైర్హాజరీతో పాటు ఇంగ్లండ్ పర్యటనలో క్వీన్ స్వీప్ అయిన ఆ జట్టు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. జట్టులోని ఆటగాళ్లకు పెద్దగా అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం లేదు. ఈ పరిస్థితుల్లో భారత జట్టే సునాయసంగా గెలుస్తుందనిపిస్తుంది.

తుది జట్లు అంచనా
భారత్: శిఖర్ ధావన్ (కెప్టెన్), పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, ఇషాన్ కిషన్(కీపర్), హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్/నవ్‌దీప్ సైనీ, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్/వరుణ్ చక్రవర్తీ

శ్రీలంక :
పాతుమ్ నిస్సంకా, చరిత్ అసలాంకా, డసన్ షనక (కెప్టెన్), అవిష్కా ఫెర్నాండో, వానిందు హరసరంగ, రామేశ్ మెండీస్, ధనుంజయ డిసిల్వా, ప్రవీణ్ జయవిక్రెమా, చామిక కరుణరత్నే, దుష్మంత చమీరా, ఇసురు ఉడాన.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications