
అదరగొట్టిన అర్ష్‌దీప్ సింగ్..
టాస్ గెలిచి ఫీల్డింగ్‌కు దిగిన భారత్.. గ్రీన్ వికెట్‌ను చక్కగా ఉపయోగించుకుంది. తొలి ఓవర్‌లోనే దీపక్ చాహర్ సూపర్ స్వింగర్‌తో సఫారీ కెప్టెన్ టెంబా బవుమా(0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక రెండో ఓవర్ వేసిన అర్ష్‌దీప్ సింగ్ సైతం అదిరిపోయే స్వింగ్‌తో క్వింటన్ డికాక్(1)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత మార్క్‌రమ్ బౌండరీ బాదినా.... చివరి రెండు బంతుల్లో రస్సౌ(0), డేవిడ్ మిల్లర్(0)లను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చి సౌతాఫ్రికా పతనాన్ని శాసించాడు.
దీపక్ చాహర్ వేసిన మూడో ఓవర్‌లో యువ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్(0) నిర్లక్ష్యపు షాట్ ఆడి క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. దాంతో 9 పరుగులకే సఫారీ టీమ్ 5 వికెట్లు కోల్పోయింది. దాంతో టీ20ల్లో సౌతాఫ్రికా అత్యంత చెత్త రికార్డు నమోదు చేసింది. తక్కువ పరుగుల వ్యవధిలోనే ఐదు వికెట్లు కోల్పోయిన అప్రతిష్టను మూటగట్టుకుంది.

ఆదుకున్న మార్క్‌రమ్..
దీపక్ చాహర్ వేసిన 5వ ఓవర్‌లో సిక్సర్ బాదిన మార్క్‌రమ్.. మరో వికెట్ పడకుండా అర్ష్‌దీప్ సింగ్ 6వ ఓవర్ ఆడటంతో సౌతాఫ్రికా పవర్ ప్లేలో 5 వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. అనంతరం హర్షల్ పటేల్ వేసిన ఏడో ఓవర్‌లో మరో భారీ సిక్సర్ బాది జోరు కనబర్చిన మార్క్‌రమ్(25) అదే ఓవర్‌గా ఎల్బీగా వెనుదిరిగాడు. ఈ వికెట్‌ను టీమిండియా రివ్యూ తీసుకోవడం విశేషం. రివ్యూ తీసుకోవాలా? వద్దా? అని డైలామా పడిన రోహిత్.. చివరకు పంత్ సూచనలతో సమీక్ష కోరి ఫలితం రాబట్టాడు. దాంతో సౌతాఫ్రికా 46 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఇజ్జత్ కాపాడిన కేశవ్ మహరాజ్..
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన వాయ్నే పార్నెల్(24), కేశవ్ మహరాజ్ ఆచితూచి ఆడారు. పూర్తిగా ఆత్మరక్షణలో ఆడిన ఈ జోడి వీలుచిక్కిన బంతినే బౌండరీకి తరలించింది. క్రీజులో సెట్ అవుతున్న ఈ జోడీని అక్షర్ పటేల్ విడదీసాడు. పార్నెల్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన రబడాతో కలిసి కేశవ్ మహరాజ్ స్కోర్‌ను పెంచే ప్రయత్నం చేశాడు. అర్ష్‌దీప్ వేసిన 19వ ఓవర్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదిన కేశవ్ మహరాజ్.. జట్టు స్కోర్‌ను 100 ధాటించాడు. ఇక హర్షల్ పటేల్ వేసిన చివరి ఓవర్‌లో సూపర్ యార్కర్‌కు కేశవ్ మహరాజ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో సఫారీ ఇన్నింగ్స్ 106 పరుగులకే పరిమితమైంది.


Click it and Unblock the Notifications
