IND vs SA: కోహ్లీ, రోహిత్ లేడు.. భారత్ X సౌతాఫ్రికా వన్డే సిరీస్‌ను దేకెటోడే లేడు!

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ కోసం రోహిత్ సేన ఆస్ట్రేలియాలో ఉండగా.. స్వదేశంలో సౌతాఫ్రికాతో శిఖర్ ధావన్ సారథ్యంలోని టీమిండియా వన్డే సిరీస్ ఆడుతోంది. బౌలర్లు, టాపార్డర్ వైఫల్యం,చెత్త ఫీల్డింగ్‌తో తొలి వన్డేలో ఓడిపోయిన భారత్.. మూడు వన్డేల సిరీస్‌లో 0-1తో వెనుకంజలో నిలిచింది.
రాంచీ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో నిలవాలని చూస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు సౌతాఫ్రికా నిలకడగా ఆడుతుండగా.. భారత బౌలర్లు శ్రమిస్తున్నారు. అయితే ఈ వన్డే సిరీస్‌కు పెద్దగా ప్రేక్షకాదరణ లభించడంలేదు.
కోహ్లీ, రోహిత్ లేకపోవడంతో...
రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకపోవడంతో ఈ సిరీస్‌ను జనాలు లైట్ తీసుకున్నారు. దాంతోనే గత సిరీస్‌లు మాదిరిగా.. ఈ సిరీస్‌లో భారత్ గెలిచినా.. ఓడినా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన తొలి వన్డేను కూడా ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. మాములుగా భారత్ మ్యాచ్ జరిగితే హాట్ స్టార్‌లో కోటికిపైనే వ్యూస్ వస్తాయి. కానీ తొలి వన్డేలో ఈ సంఖ్య 50 లక్షలు ధాటలేదంటే జనాలు ఈ సిరీస్‌ను ఎంతగా లైట్ తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.

ద్వితీయ శ్రేణి జట్టు కావడంతో..
ఈ సిరీస్‌కు ప్రేక్షక ఆదరణ లభించకపోవడానికి సీనియర్ ప్లేయర్లు లేకపోవడం ప్రధాన కారణమైతే మరో కారణం వన్డే ఫార్మాట్ కావడం. టీ20లు రాజ్యమేలుతున్న ఈ కాలంలో వన్డే క్రికెట్‌కు ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది. జనాలకు గంటలకొద్ది మ్యాచ్‌లు చూసే ఓపిక నశించింది. అందుకే క్రికెట్‌లో టీ10, 100 లీగ్ వంటి కొత్త ఫార్మాట్‌లు పుట్టుకొస్తున్నాయి. ఆదివారం హాలిడే రోజున జరుగుతున్న భారత్Xసౌతాఫ్రికా మ్యాచ్ జనాలు ఎంతగా లైట్ తీసుకున్నారంటే.. సాధారణ మ్యాచ్‌ల్లో వచ్చే 10 శాతం వ్యూస్ కూడా రావడం లేదు. సౌతాఫ్రికా బ్యాటింగ్ చేస్తుండగా హాట్‌స్టార్‌లో వ్యూస్ 13 లక్షలకు మించలేదు. భారత బ్యాటింగ్ టైమ్‌లో ఈ సంఖ్య పెరిగే 50 లక్షలకు రావచ్చు. కానీ రోహిత్ సేన ఆడినప్పటిలా కోటీ వ్యూస్ అయితే వచ్చే అవకాశం లేదు.

సిరాజ్ దోబార్..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 39 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లకు 217 పరుగులు చేసింది. రీజా హెండ్రీక్స్ (76 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 74), ఎయిడెన్ మార్క్‌రమ్(89 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 79) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్, షెహ్‌బాజ్ అహ్మద్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications