For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సంజూ శాంసన్‌ సీరియస్‌ చాలెంజ్‌లు విసురుతున్నాడు.. పంత్‌కు గంభీర్‌ వార్నింగ్‌!!

Gautam Gambhir Slams Rishabh Pant Says 'My Favourite Is Throwing Serious Challenges At Him'
India vs South Africa: My favourite Sanju Samson is throwing serious challenges to Rishabh Pant says Gautam Gambhir

న్యూఢిల్లీ: నా ఫేవరేట్ ఆటగాడు సంజూ శాంసన్‌ సీరియస్‌ చాలెంజ్‌లు విసురుతున్నాడు. నీ స్థానానికి ప్రమాదం పొంచి ఉంది అని టీమిండియా యువ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌కు మాజీ ఆటగాడు గౌతం గంభీర్‌ గట్టి వార్నింగ్‌ ఇచ్చాడు. ఓ సారి నీ ప్రదర్శనపై పరిశీలన చేసుకుంటే మంచిదని కూడా గంభీర్‌ సలహా ఇచ్చాడు.

సవాల్‌ ఎదురుకానుంది:

సవాల్‌ ఎదురుకానుంది:

భారత్, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్ నేపథ్యంలో గంభీర్‌ మాట్లాడుతూ... 'పంత్ మంచి ఆటగాడు. అతనిలో చాలా టాలెంట్ ఉంది. అందులో సందేహం లేదు. అయితే ఇటీవల కాలంలో పంత్‌ ఆట ఏమంత బాగాలేదు. పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు. పంత్ ఇలానే ఆడితే.. అతని స్థానానికి ప్రమాదం పొంచి ఉంది. వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌తో నీకు సవాల్‌ ఎదురుకానుంది. నా ఫేవరెట్‌ ఆటగాడు శాంసన్‌ నీకు సీరియస్‌ చాలెంజ్‌లు విసురుతున్నాడు' అని వార్నింగ్‌ ఇచ్చాడు.

తన ప‍్రదర్శనపై పరిశీలన చేసుకోవాలి:

తన ప‍్రదర్శనపై పరిశీలన చేసుకోవాలి:

'పంత్‌కు చాలా అవకాశాలు లభించాయి. అతను ఒక్కసారి వెనక్కి చూసుకుని తన ప‍్రదర్శనపై పరిశీలన చేసుకుంటే మంచిది. ఇప్పటికైనా మంచి ప్రదర్శన చేయాల్సిన సమయం వచ్చింది' అని గంభీర్‌ సూచించాడు. 'మనీష్‌ పాండే, శ్రేయస్‌ అయ్యర్‌లు తమ స్థానాలను నిలబెట్టుకోవడానికి మరొక అవకాశం లభించింది. అందరూ నిరూపించుకోవాలి. యువ బౌలర్లకు కూడా దక్షిణాఫ్రికా సిరీస్‌ వరం లాంటిది' అని గంభీర్‌ పేర్కొన్నాడు.

జట్టుపై తీవ్ర ప్రభావం చూపనుంది:

జట్టుపై తీవ్ర ప్రభావం చూపనుంది:

'దక్షిణాఫ్రికాతో జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్‌లో టీమిండియానే ఫేవరెట్‌. ప్రస్తుత సఫారీ జట్టులో అనుభవం ఉన్న ఆటగాళ్ల లోటు కనబడుతోంది. ప్రధానంగా డుప్లెసిస్‌, ఆమ్లా, డేల్‌ స్టెయిన్‌లు సఫారీ జట్టుకు అందుబాటు లేకపోవడంతో.. జట్టు బలహీన పడింది. వారి లోటు జట్టుపై తీవ్ర ప్రభావం చూపనుంది' అని గంభీర్‌ చెప్పుకొచ్చారు.

మాజీ కెప్టెన్‌కు హెచ్‌ఐవీ.. సామాజిక బహిష్కరణకు గురిచేయొద్దని విజ్ఞప్తి!!

శాస్త్రి హెచ్చరికలు:

శాస్త్రి హెచ్చరికలు:

పంత్‌ నిర్లక్ష్య ఆటతీరుపై కోచ్‌ రవిశాస్త్రి కూడా హెచ్చరికలు జారీ చేశాడు. 'మా ప్రోత్సాహం పంత్‌కు ఉంటుంది. అయితే ట్రినిడాడ్‌ మ్యాచ్‌లో తొలి బంతికే అతడు అవుటైన తీరు నిరాశపరిచింది. ఇది మళ్లీ రిపీట్‌ అయితే మాత్రం వేటు తప్పదు. పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్‌ కొనసాగిస్తే.. జట్టు విజయాలకు కారణమవుతాడు' అని రవిశాస్త్రి అన్నాడు.

Story first published: Monday, September 16, 2019, 11:10 [IST]
Other articles published on Sep 16, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+