
సెలక్షన్‌కు అందుబాటులో లేడు:
ధోనీని జట్టులోకి ఎందుకు తీసుకోలేదని ఎమ్మెస్కే ప్రశ్నించగా.. 'ధోనీ సెలక్షన్‌కు అందుబాటులో లేడు' అని సమాధానం ఇచ్చాడు. మరోవైపు 'ప్రస్తుతం ధోనీ అమెరికాలో ఉన్నాడు. తనకు తానుగా సెలక్షన్‌కు అందుబాటులో లేడు' అని ధోనీ సన్నిహితుడు ఒకరు స్పష్టం చేశారు. దీంతో.. ధోనీ ప్రస్తుతం అమెరికాలో ఉన్న కారణంగానే సెలక్షన్‌కు అందుబాటులో లేనట్లు స్పష్టం అయింది. అయితే వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లో ధోనీ స్థానం దక్కించుకోవాలంటే మాత్రం ఫామ్, ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.

యువకులకు అవకాశం:
ఎమ్మెస్కే మాట్లాడుతూ... 'యువ స్పినర్లకు అవకాశం ఇవ్వాలనుకున్నాం. రాహుల్ చాహర్, కృనాల్ పాండ్య, వాషింగ్టన్ సుందర్ విండీస్ సిరీస్‌లలో అద్భుతంగా రాణించారు. అందుకే వాళ్లకి మరో ఛాన్స్ ఇచ్చాం. పేసర్లు ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవదీప్ సైనీలు పేస్ బౌలింగ్ బాధ్యతలు మోయనున్నారు. వారు రాణిస్తారని నమ్మకం ఉంది' అని ఆయన తెలిపారు.

పాండ్యా పునరాగమనం:
సెప్టెంబరు 15, 18, 22 తేదీల్లో టీ20 సిరీస్ జరగనుంది. ప్రపంచకప్ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్లీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. వరుసగా మ్యాచ్‌లు ఆడుతున్న పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఈ ఒక్క మార్పు మినహా విండీస్‌తో టీ20ల్లో తలపడిన జట్టునే సెలెక్టర్లు కొనసాగించారు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కృనాల్ పాండ్యా రూపంలో ప్రస్తుతం జట్టులో ముగ్గురు ఆల్‌రౌండర్‌లు ఉన్నారు.
విజయం కోసం పునేరి పాల్టాన్‌ను టార్గెట్ చేసిన తెలుగు టైటాన్స్

జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), హర్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, కృనాల్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్, నవదీప్ సైనీ.


Click it and Unblock the Notifications












