Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs South Africa మూడో టీ20 సజావుగా సాగేనా? వాతావరణం ఎలా ఉందంటే..?

India vs South Africa 3rd T20: Check Weather Forecast And Pitch Report Of Holkar International Stadium

ఇండోర్: సౌతాఫ్రికాపై ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. మంగళవారం జరిగే ఆఖరిదైన మూడో టీ20లోనూ గెలిచి సఫారీలను వైట్ వాష్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే సిరీస్ పరంగా ఈ మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా పెద్దగా ప్రాధాన్యలేకపోయినా.. రోహిత్ సేన బౌలర్లు మాత్రం మరోసారి కఠిన పరీక్ష ఎదుర్కోనున్నాడు. ఆసీస్‌లో టీ20 ప్రపంచకప్‌కు చాలా తక్కువ సమయమే ఉండటంతో.. ఇప్పటికీ డెత్ ఓవర్స్ వేసే సరైన బౌలర్లను టీమిండియా వెతికి పట్టుకోలేకపోయింది. బుమ్రా గైర్హాజరీ, రెండో టీ20లో మిల్లర్ మెరుపులతో అర్ష్‌దీప్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్ తీవ్ర ఒత్తిడిలో పడిపోయారు. కనీసం ఈ మయాచ్‌లోనైనా వీళ్లు గాడిలో పడతారో? లేదో? చూడాలి.

కోహ్లీ, రాహుల్‌కు రెస్ట్..

కోహ్లీ, రాహుల్‌కు రెస్ట్..

సిరీస్‌ ఫలితం తేలడంతో.. పెద్దగా ప్రాధాన్యం లేని మ్యాచ్‌లో కోహ్లీ, రాహుల్‌కు విశ్రాంతినిచ్చారు. దీంతో కోహ్లీ స్థానంలో శ్రేయాస్‌ అయ్యర్‌ తుది జట్టులో ఆడే అవకాశం ఉండగా.. సూర్యకుమార్‌, పంత్‌లలో ఒకరు రోహిత్‌తో కలసి ఓపెనింగ్‌ చేయొచ్చు. షాబాజ్‌ అహ్మద్‌, సిరాజ్‌ లేదా ఉమేశ్‌కు చాన్స్‌ దక్కొచ్చు. చివరి మ్యాచ్‌ ముగిసిన తర్వాత.. ఈనెల 6న ప్రపంచకప్‌ కోసం బయల్దేరే భారత జట్టులో కోహ్లీ, రాహుల్‌ చేరతారని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ఇక, మెగా ఈవెంట్‌ ముందు భారత బ్యాటింగ్‌ గాడిలో పడినట్టుగానే కనిపిస్తోంది. రాహుల్‌ మంచి స్ట్రయిక్‌ రేట్‌తో బ్యాటింగ్‌ చేస్తుండగా.. కోహ్లీ నిలకడగా ఆడుతున్నాడు. రోహిత్‌ తనదైన రోజు రెచ్చిపోతుండగా.. సూర్య దూకుడైన బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. కాగా, పంత్‌, దినేష్‌ కార్తీక్‌కు తగిన మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కావాలి.

వాతావరణం..

వాతావరణం..

ఈ మ్యాచ్‌కు వర్ష సూచనలేదు. ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా జరగనుంది. ఉష్ణోగ్రతలు 21 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇండోర్ నగరాన్ని మేఘాలు కమ్మేయడంతో ఉక్కపోతగా ఉంది. ఇది కాస్త ఆటగాళ్లకు అసౌకర్యం కల్పించవచ్చు. ఇప్పటికే మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఈ మ్యాచ్ కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసింది.

పిచ్ రిపోర్ట్..

పిచ్ రిపోర్ట్..

ఈ మైదానం చాలా చిన్నది. కాబట్టి మరోసారి బ్యాటర్లు పండుగ చేసుకోనున్నారు. అయితే పిచ్‌పై కాస్త బౌన్స్ లభించినప్పటికీ బౌలర్లకు కష్టాలు తప్పవు. ఇదే మైదానంలో టీమిండియా టీ20ల్లో 260 ప రుగులు చేసింది. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 118 పరుగులతో రాణించాడు. కాబట్టి ఈ మ్యాచ్‌లోనూ పరుగుల వరద పారనుంది.

Story first published: Tuesday, October 4, 2022, 8:27 [IST]
Other articles published on Oct 4, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+