Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సఫారీలకు చుక్కులు చూపించే ఆ ఐదుగురు క్రికెటర్లు వీరే!

South Africa Tour Of India 2019 : Five Indian Cricketers Who Can Trouble Proteas In Test Series
 India vs South Africa 2019: Five Indian cricketers who can trouble Proteas in Test series

హైదరాబాద్: టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ సెప్టెంబర్ 15న ధర్మశాల వేదికగా జరగనున్న తొలి టీ20లో ప్రారంభం కానుంది. భారత పర్యటనలో భాగంగా సఫారీ జట్టు 3 టీ20లు, 3 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. టీ20 సిరిస్ ముగిసిన తర్వాత టీమిండియా అక్టోబర్ 2 నుంచి ఇరు జట్ల మధ్య టెస్టు సిరిస్ ప్రారంభమవుతుంది.

చివరగా 2015-16లో భారత పర్యటనకు వచ్చిన సఫారీ జట్టు ధోని నాయకత్వంలోని టీమిండియాను చిత్తగా ఓడించి టీ20, వన్డే సిరిస్‌ను గెలుచుకోగా... టెస్టు సిరిస్‌లో మాత్రం 0-3తో ఓడిపోయింది. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఆ తప్పుని మరోసారి పునరావృతం చేయకూడదని భావిస్తోంది.

అయితే, ఈ సిరిస్‌లో ఇరు జట్ల మధ్య ఎలాంటి వన్డేలు జరగడం లేదు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య జరగనున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో టీమిండియానే ఫేవరేట్‌గా కనిపిస్తోంది. హషీమ్ ఆమ్లా, డేల్ స్టెయిన్, ఏబీ డివిలియర్స్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు లేకుండా సఫారీ జట్టు భారత పర్యటనకు వస్తోంది.

దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనలో సత్తా చాటే భారత ఆటగాళ్లను ఒక్కసారి పరిశీలిద్దాం...

విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ

ఇటీవలే వెస్టిండిస్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు. సబీనా పార్కు వేదికగా జరిగి రెండో టెస్టులో విరాట్ కోహ్లీ డకౌటయ్యాడు. అంతేకాదు ఈ సిరిస్‌లో విరాట్ కోహ్లీ అత్యధిక స్కోరు 78. అయితే, సఫారీ జట్టు భారత పర్యటనలో మాత్రం కోహ్లీ ఆ తప్పిదాలను పునరావృతం కానివ్వకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.

అజ్యింకే రహానే

అజ్యింకే రహానే

అద్భుతమైన మిడిలార్డర్ బ్యాట్స్‌మన్. 2017లో శ్రీలంక పర్యటన నుంచి భారీ స్కోర్లు సాధించడంలో రహానే విఫలమవుతున్నాడు. అయితే, విదేశీ పిచ్‌లపై సత్తా చాటగలడన్న పేరుంది. వెస్టిండిస్‌తో ముగిసిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను టీమిండియా 2-0తో క్లీన్ స్వీప్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన రహానే ఆ తర్వాత రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరిస్‌లో సైతం రహానే సత్తా చాటుతాడని క్రికెట్ విశ్లేషకులు అంచనా.

తమిళ తలైవాస్ vs పట్నా పైరేట్స్: గెలుపు రుచి చూసేదెవరు?

రవిచంద్రన్ అశ్విన్

రవిచంద్రన్ అశ్విన్

వెస్టిండిస్‌తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో చోటు దక్కించుకోలేకపోయిన అశ్విన్ సొంతగడ్డపై సపారీలతో జరగనున్న సిరిస్‌లో మాత్రం తప్పకుండా ఎంపికవుతాడు. అందుకు కారణం 2015-16లో సఫారీ జట్టు భారత పర్యటనక వచ్చిన సమయంలో అశ్విన్ 31 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించాడు. అయితే, చైనామన్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్‌లు వచ్చిన తర్వాత అశ్విన్‌కు తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా మారింది. మరోవైపు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఈ మధ్య కాలంలో నిలకడగా రాణిస్తున్నాడు.

జస్ప్రీత్ బుమ్రా

జస్ప్రీత్ బుమ్రా

టీమిండియా ప్రధాన పేసర్‌గా కొనసాగుతన్న జస్ప్రీత్ బుమ్రా ఇప్పటివరకు ఆడిన 12 టెస్టులు కూడా విదేశీ పిచ్‌లపైనే ఆడటం విశేషం. సఫారీలతో జరగనున్న టెస్టు సిరిస్ బుమ్రాకు సొంతగడ్డపై తొలి టెస్టు సిరిస్ కావడం విశేషం. ఇటీవలే ముగిసి విండిస్ పర్యటనలో హ్యాట్రిక్ వికెట్లతో అద్భుత ప్రదర్శన చేసిన ఈ సిరిస్‌లో సైతం తప్పక రాణిస్తాడని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

ఇషాంత్ శర్మ

ఇషాంత్ శర్మ

టెస్టు క్రికెట్‌లో ఇషాంత్ శర్మ గురించి చెప్పాల్సిన పని లేదు. గత కొన్ని సంవత్సరాలుగా అటు సొంతగడ్డపై ఇటు విదేశీ పిచ్‌లపై ఇషాంత్ శర్మ అద్భుత ప్రదర్శన చేస్తోన్న సంగతి తెలిసిందే. తన లైన్ అండ్ లెంత్ బంతులతో సఫారీ బ్యాట్స్‌మెన్‌‌ను తప్పకుండా ఇరకాటంలో పెట్టగల అద్భుతమైన బౌలర్.

Story first published: Monday, September 9, 2019, 16:57 [IST]
Other articles published on Sep 9, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+