India vs South Africa బాక్సింగ్ డే టెస్ట్‌కు భారీ అడ్డంకి!
సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా అసలు సిసలు సమరానికి సిద్దమైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా ఆతిథ్య సౌతాఫ్రికాతో రెండు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా మంగళవారం జరగనున్న బాక్సింగ్ డే టెస్ట్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
ఇప్పటి వరకు సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా టెస్ట్ సిరీస్ విజయాన్ని అందుకోలేదు. దాంతో రోహిత్ శర్మ సారథ్యంలోని నెంబర్ వన్ టెస్ట్ టీమ్ అయిన టీమిండియా.. ఈ సారి ఆ కోరికను తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ గెలుపుతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌తో పాటు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తోంది.

అయితే ఈ బాక్సింగ్ డే టెస్ట్‌కు భారీ అడ్డంకి ఏర్పడింది. ప్రస్తుతం సెంచూరియన్‌లో వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కూడా వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే సెంచూరియన్ మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. వర్షం కారణంగా టీమిండియా తమ చివరి ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేసుకుంది.
మ్యాచ్ జరిగే సమయంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే తొలి రోజు ఆట పూర్తిగా రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి రోజే కాకుండా రెండో రోజు ఆట కూడా రద్దయ్యే అవకాశాలు ఉన్నాయి. వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలిగి ప్రారంభమైతే .. పిచ్ పూర్తిగా బౌలర్లకు సహకరించనుంది.
ముఖ్యంగా పేసర్లు స్వింగ్, రివర్స్ స్వింగ్‌తో నిప్పులు చెరిగే అవకాశం ఉంది. పేస్‌కు అనుకూలంగా ఉండే సౌతాఫ్రికా పిచ్‌లపై బ్యాటింగ్ చేయడం బ్యాటర్లకు అతి పెద్ద సవాలే.
భారత టెస్ట్ టీమ్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్(కీపర్), కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్), ప్రసిధ్ కృష్ణ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications