Ind vs SA తొలి వన్డేకు భారీ అడ్డంకి.. మ్యాచ్ జరగడం డౌటే!

లక్నో: సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌కు శిఖర్ ధావన్ సారథ్యంలోని భారత ద్వితీయ శ్రేణి జట్టు సిద్దమైంది. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ గెలిచిన రోహిత్ సేన ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాకు చేరుకోగా.. ధావన్ సేన లక్నో వేదికగా జరగనున్న తొలి వన్డేలో అమీతుమీ తేల్చుకోనుంది. ప్రధాన ఆటగాళ్ల గైర్హాజరీలో దేశవాళీ, ఐపీఎల్ స్టార్స్ తమ సత్తా చాటేందుకు సిద్దమయ్యారు. ఇండియా-ఏ, దేశవాళీ క్రికెట్‌తో మంచి ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లు.. అంతర్జాతీయ స్థాయిలో అదే జోరును కొనసాగించాలనుకుంటున్నారు. ధావన్, శేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ రీఎంట్రీ ఇవ్వనుండగా.. ప్రపంచకప్ స్టాండ్ బై లిస్ట్‌లో ఉన్న సిరాజ్, దీపక్ చాహర్‌లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. మరోవైపు రజత్ పటీదార్, షెహ్‌బాజ్ అహ్మద్, రాహుల్ త్రిపాఠి వంటి దేశీయ స్టార్లు అంతర్జాతీయ అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నారు.

రజత్ పటీదార్‌కు చాన్స్..
ఈ క్రమంలోనే జట్టు కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ప్లేయర్ రజత్ పటీదార్.. సౌతాఫ్రికాతో జరిగే తొలి వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతను 9 మ్యాచ్‌లు ఆడి 4 సెంచరీలతో పాటు 5 హాఫ్ సెంచరీలు బాదాడు. ఐపీఎల్‌లోనూ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అప్పటి నుంచి అదే జోరు కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతనికి గబ్బర్ సేనలో అవకాశం దక్కనుంది. అయితే రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్‌లతో అతనికి తీవ్ర పోటీ ఎదురుకానుంది. సీనియర్‌కు ప్రాధానత్య ఇవ్వాలని భావిస్తే ఇషాన్ కిషన్ జట్టులోకి వస్తాడు. అప్పుడు రజత్ పటీదార్ వేచి చూడాల్సి ఉంటుంది.

మ్యాచ్‌కు వర్ష సూచన..
ఈ మ్యాచ్‌కు వేదికైన లక్నోలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు కూడా వర్షం వచ్చే అవకాశం ఉంది. మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. మంగళవారం రాత్రి నుంచి వర్షం ఎడతెరిపిలేకుండా కురుస్తూనే ఉంది. అయితే మైదానంలో డ్రైనేజీ సిస్టమ్ బాగుండటం కలిసొచ్చే అంశం. కెప్టెన్ శిఖర్ ధావన్ కూడా ఈ విషయంపై స్పందించాడు. 'వర్షం వచ్చేది రానిది మన చేతుల్లో లేని అంశం. గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ బాగుండటం సానుకూలంశం. మ్యాచ్ జరుగుతుందనే మేం ఆశిస్తున్నాం. మేం అయితే అన్ని విధాలుగా సిద్దమయ్యాం.'అని తెలిపాడు.

పిచ్ రిపోర్ట్..
ఎకనా స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు ప్రతికూలమైనది. ఇక్కడ జరిగిన మూడు వన్డేల్లో యావరేజ్ స్కోర్ 230 పరుగులే. బౌలర్లకు అనుకూలంగా ఉండనుంది. అయితే టీ20ల్లో మాత్రం భారీ స్కోర్లు నమోదయ్యాయి. వర్షం వస్తుండటంతో పిచ్‌పై కవర్లు కప్పి ఉంచారు. కాబట్టి స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications