Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Scotland: మరో పసికూనతో మ్యాచ్.. భారీ విజయం సాధిస్తేనే భారత్‌కు చాన్స్!

India vs Scotland Preview: Virat Kohli and Co Eye Another Big Win
T20 World Cup Semifinals : IND Vs SCO భారీ విజయం.. అప్పుడే సెమీస్ కు || Oneindia Telugu

హైదరాబాద్: అఫ్గానిస్థాన్‌పై అద్భుత విజయంతో టీ20 ప్రపంచకప్‌లో బోణీ కొట్టిన భారత్.. మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. శుక్రవారం దుబాయ్ వేదికగా జరిగే మ్యాచ్‌లో పసికూన స్కాట్లాండ్‌తో తలపడనుంది. కాస్తో కూస్తో ఉన్న సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో భారీ విజయాన్నందుకోవాలి. లేకుంటే మ్యాచ్ గెలిచినా పెద్దగా ఫలితం ఉండదు. పాకిస్థాన్, న్యూజిలాండ్‌తో చిత్తుగా ఓడిన భారత్.. సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

టోర్నీలో మిగిలిన మూడు మ్యాచ్‌లు గెలిచినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌తో సహా.. సోమవారం నమీబియాతో జరిగే మ్యాచ్‌లో భారత్ భారీ విజయం సాధించాలి. అప్పుడే కోహ్లీసేన రన్ రేట్ మెరుగువుతోంది.

 నిలవాలంటే భారీ విజయం కావాలి..

నిలవాలంటే భారీ విజయం కావాలి..

అంతేకాకుండా న్యూజిలాండ్ జట్టు ఈరోజు నమీబియా చేతిలో లేదా ఆదివారం అఫ్గానిస్థాన్ చేతిలో ఓడిపోవాలి. అప్పుడే టీమిండియా సెమీస్ రేసులో నిలవనుంది. న్యూజిలాండ్ అఫ్గాన్ చేతిలో గనుక ఓడితే అప్పుడు మెరుగైన రన్ రేట్ కలిగిన జట్టు సెమీఫైనల్‌కు చేరుతుంది. ఈ క్రమంలోనే స్కాట్లాండ్‌తో మ్యాచ్ ప్రాధాన్యతను సంతరించుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో చెత్త బ్యాటింగ్, పేలవ బౌలింగ్‌తో తీవ్రంగా నిరాశపరిచిన టీమిండియా.. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో దుమ్మురేపి అందరిలోనూ ఆశలు రేకెత్తించింది. దాంతో స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లోనూ భారత్ చెలరేగుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

పటిష్టంగా భారత్..

పటిష్టంగా భారత్..

గత మ్యాచ్‌ల్లో చేసిన తప్పిదాలను సరిదిద్దుకొని సరైన కాంబినేషన్‌తో బరిలోకి దిగిన టీమిండియా అద్భుతంగా రాణించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ దుమ్మురేపారు. ధనాధన్ బ్యాటింగ్‌తో చెలరేగి 140 ప్లస్ భాగస్వామ్యం అందించారు. వారు ఫామ్‌లోకి రావడం టీమిండియాకు శుభసూచకం. ఈ మ్యాచ్‌లో కూడా మంచి ఆరంభమిస్తే భారత్‌కు తిరుగుండదు.

ఇక ఫస్ట్ డౌన్ విరాట్ కోహ్లీ రానున్నాడు. పాక్‌పై మంచి ప్రదర్శన కనబర్చిన విరాట్.. న్యూజిలాండ్‌పై విఫలమయ్యాడు. అఫ్గాన్ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక పంత్, హార్దిక్ పాండ్యా టచ్‌లోకి రావడంతో భారత్ బ్యాటింగ్ లైనప్ భీకరంగా కనిపిస్తోంది. టాప్-5‌లో ఏ ముగ్గురు చెలరేగినా భారత్ భారీ స్కోర్ చేయడం ఖాయం. బౌలింగ్‌లో బుమ్రా రఫ్ఫాడిస్తుండగా.. షమీ లయ అందుకున్నాడు. అశ్విన్ రాకతో బౌలింగ్ బలం పెరిగింది.

తక్కువ అంచనా వేయలేం..

తక్కువ అంచనా వేయలేం..

మరో‌వైపు పసికూన అయిన స్కాట్లాండ్‌ను తక్కువ అంచనా వేయలేం. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత పోరాటం కనబర్చిన స్కాట్లాండ్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కాబట్టి ఆ జట్టును ఏ మాత్రం లైట్ తీసుకోవద్దని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. ఇక భారత్, స్కాట్లాండ్ జట్లు ఇప్పటి వరకూ టీ20 వరల్డ్‌కప్‌లో ఒకే ఒక్కసారి తలపడ్డాయి. 2007 టీ20 వరల్డ్‌కప్‌‌లో భాగంగా జరగబోయిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన స్కాట్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కానీ.. వర్షం కారణంగా ఒక బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయ్యింది. ఆ తర్వాత ఎప్పుడూ ఈ జట్లు టీ20 వరల్డ్‌కప్‌లో తలపడలేదు.

పిచ్ రిపోర్ట్

పిచ్ రిపోర్ట్

దుబాయ్ పిచ్ ఆరంభంలో బౌలింగ్‌కు అనుకూలిస్తోంది. అయితే బ్యాట్స్‌మన్ ఆచితూచి ఆడితే పరుగులు చేయవచ్చు. పాకిస్థాన్, స్కాట్లాండ్ మ్యాచ్‌లో ఈ విషయం స్పష్టమైంది. ఇక తేమ ప్రభావం ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో టాస్ గెలిచిన జట్టు ఏ మాత్రం ఆలోచించకుండా ఫీల్డింగ్ తీసుకునే అవకాశం ఉంది. సెకండ్ బ్యాటింగ్ చేసే జట్లకు అడ్వాంటేజ్ ఉంటుంది. స్పిన్నర్లకు అనుకూలిస్తోంది.

తుది జట్లు(అంచనా)

తుది జట్లు(అంచనా)

భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా

స్కాట్లాండ్: జార్జ్ మున్సే, కైల్ కోజెర్(కెప్టెన్), మాథ్యూ క్రాస్, రిచీ బెర్రింగ్టన్, కలమ్ మెక్‌లెడ్, మైకేల్ లీస్క్, క్రిస్ గ్రీవ్స్, మార్క్ వాట్, సఫ్యాన్ షరీఫ్, అలాస్‌డైర్ ఈవాన్స్, బ్రాడ్‌లీ వీల్

Story first published: Friday, November 5, 2021, 12:15 [IST]
Other articles published on Nov 5, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+