World Cup 2023 : వర్షం రాదు.. కానీ పరుగుల వరదే!
అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్ 2023కు మరింత ఊపు తీసుకొచ్చే మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌కు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. వరల్డ్ బిగ్టెస్ట్ రైవలరీ అయిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు మరికొద్ది సేపట్లో తెరలేవనుంది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఏర్పాటు చేసిన ఆరంభ వేడుకలు అభిమానులను అలరించనున్నాయి.
మ్యాచ్ ముందే కాకుండా ఇన్నింగ్స్ బ్రేక్‌లోనూ బాలీవుడ్ స్టార్స్ తమ ఆట పాటలతో అభిమానులను కనువిందు చేయనున్నారు. లక్షా 30 వేల మంది హాజరయ్యే ఈ మ్యాచ్ కోసం బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇరు జట్లు సైతం ఈ మ్యాచ్ కోసం సిద్దమయ్యాయి. విజయమే లక్ష్యంగా తమ వ్యూహాలను సిద్దం చేసుకున్నాయి. గెలుపు తమదంటే తమదనే ధీమాతో ఉన్నాయి.

మెగా టోర్నీలో ఇరు జట్లు తమ తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలవడం... బలబలాల పరంగా సమంగా ఉండటంతో రసవత్తర పోరు ఖాయం. అయితే ఈ మ్యాచ్‌కు వర్ష సూచన ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుతం అక్కడ వాతావరణం చాలా వేడిగా ఉక్కపోతగా ఉంది. సాయంత్ర చిరు జల్లులు పడే ఛాన్స్ ఉంది. అయితే మ్యాచ్‌కు ఎలాంటి అంతరాయం కలిగే అవకాశం లేదు. అక్కడికి చేరుకున్న అభిమానులు సైతం వర్షం వచ్చే సూచనే లేదని సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు.
వర్షం ఏమో కానీ పరుగుల వరద పారడం ఖాయమని కామెంట్ చేస్తున్నారు. అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ కామెంటేటర్లు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్‌కు కోసం ప్రత్యేకమైన పిచ్ సిద్దం చేశారని, బ్లాక్ సాయిల్‌తో రూపొందించారని పేర్కొన్నారు. పిచ్‌పై కాస్త గ్రాస్ వదిలేయడంతో.. ఆరంభంలో కాస్త పేసర్లకు సహకరించినా ఆ తర్వాత పూర్తి బ్యాటింగ్‌కు సహకరిస్తుందని అభిప్రాయపడుతున్నారు. పిచ్ మంచి ఫ్లాట్‌గా ఉందని భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తొలుత బ్యాటింగ్ చేయడం కంటే తర్వాత బ్యాటింగ్ చేయడం సులువు. టాస్ గెలిచి జట్టు ఫీల్డింగ్‌కు మొగ్గు చూపే అవకాశం ఉంది.
భారత జట్టు వన్డే ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు పాకిస్తాన్‌పై ఒక్కసారి కూడా ఓడిపోలేదు. 7 మ్యాచ్‌ల్లో 7 సార్లు విజయం సాధించింది. ఈ రికార్డును కాపాడుకోవాలని భారత్ భావిస్తుంటే.. బ్రేక్ చేయాలని పాకిస్థాన్ పట్టుదలతో ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications