Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Pakistan: ఊర్వశి రౌటెలా: తళుక్కుమన్న ఐటమ్ గర్ల్! (వీడియో)

అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న హైఓల్టేజ్ మ్యాచ్‌లో బాలీవుడ్ హీరోయిన్, ఐటమ్ గర్ల్ ఊర్వశి రౌటెలా సందడి చేసింది. లక్షా 30 వేల మంది అభిమానులతో కిక్కిరిసిన మైదానంలో ఈ బాలీవుడ్ బ్యూటీ తన అందంతో ఆకట్టుకుంది. బ్లూ జెర్సీలతో మైదానం మొత్తం నిండగా.. బ్లూ టాప్‌లో తన అందాలతో మెరిసి కనువిందు చేసింది.

మ్యాచ్‌కు హాజరైన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కాగా.. ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. నీ అందాన్ని తట్టుకోలేక రిషభ్ పంత్, నసీమ్ షా ప్రపంచకప్‌కు దూరమయ్యారని, ఇంకెవరి కోసం మ్యాచ్‌కు వచ్చావని ప్రశ్నిస్తున్నారు.
మ్యాచ్ చూడకుండా నిన్నే చూస్తు ఉండిపోవాలనిపిస్తోందిని ఓ అభిమాని కామెంట్ చేయగా.. నీ అందం ఎవరికి సొంతమో కానీ వాడు చాలా అదృష్టవంతుడని మరొకరు కామెంట్ చేశారు. హైఓల్టేజ్ మ్యాచ్‌లో నీ హాట్ అందాలతో మరింత వేడి పుట్టిస్తున్నావని ఇంకొకరు అన్నారు. ఊర్వశీ రౌటెలాకు రిషభ్ పంత్ మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్దం నడిచిన విషయం తెలిసిందే.

 India vs Pakistan: Urvashi Rautela Shares A Video Of Herself From The Stadium

రిషభ్ పంత్ తనతో సెక్స్ చేయడానికి తెగ ఆరాటపడ్డాడని ఓ ఇంటర్వ్యూలో ఊర్వశి రౌటేలా చెప్పుకొచ్చింది. రిషభ్ పంత్ పేరును ప్రస్తావించకుండా తన కోసం హోటల్ గదిలో వేచి చూసాడని తెలిపింది. ఈ వ్యాఖ్యలపై ఫైర్ అయిన రిషభ్ పంత్ పాపులారిటీ కోసం ఇంత దిగుజారాలా?అని ప్రశ్నించాడు. దాంతో ఈ ఇద్దరి మధ్య కొన్నాళ్లు వాగ్వాదం నడిచింది.

'అరే ఓ చోటు భయ్యా.. బ్యాట్ బాల్ ఆడుకో. నేను చిన్నపిల్లను కాదు. నీలాంటి పిల్ల బచ్చాల వల్ల బద్నాం అవ్వడానికి. ఆర్‌పీ చోటు భయ్యా రక్షాబంధన్ శుభాకాంక్షలు. సైలెంట్‌గా ఉన్నానని అడ్వాంటేజ్ తీసుకోకు. నువ్వో కౌగర్ హంటర్(తన కంటే ఎక్కువ వయసున్న అమ్మాయితో శారీరక సంబంధం కోరుకునే పురుషుడు). నీ ఇజ్జత్ తీస్తా'అని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.

రోడ్డు ప్రమాదంలో రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడి జట్టుకు దూరం కాగా.. అతను త్వరగా కోరుకోవాలని ప్రార్థిస్తున్నట్లు కామెంట్ చేసి తమ గొడవకు ఫుల్‌స్టాప్ పెట్టింది. ఇక రిషభ్ పంత్, ఊర్వశీ రౌటేలా మధ్య బెడ్ రిలేషన్ ఉందని, ఆమె‌కు ఖరీదైన బహుమతులు ఇవ్వలేకనే పంత్ తమ పడక బంధాన్ని తెంచుకున్నాడని గాసిప్స్ వెలువడ్డాయి.

ఈ మధ్య సౌతిండియా సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చేస్తున్న ఊర్వశి రౌటెలా.. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో పాటు పలు తెలుగు సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసింది.

Story first published: Saturday, October 14, 2023, 18:17 [IST]
Other articles published on Oct 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+