భారత్ x పాక్ పోరు
భారత్ xపాక్ పోరు క్రికెట్‌కు బ్రాండ్ అంబాసిడర్ లాంటిదని, దాయాదీల సమరాన్ని మించినది ఏదీ లేదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఐసీసీ కూడా ఇదే విషయాన్ని క్యాష్ చేసుకుంటుందని, ప్రతీ మెగా టోర్నీల్లో భారత్, పాక్ మ్యాచ్ ఉండేలా షెడ్యూల్ చేస్తుందని ట్వీట్ చేస్తున్నారు. ఇక దుబాయ్ వేదికగా జరిగిన 2021 టీ20 ప్రపంచకప్‌లోనూ భారత్.. పాక్‌తోనే తొలి మ్యాచ్ ఆడింది. ఎన్నడూ లేని విధంగా ఈ మ్యాచ్‌లో చిత్తుగా ఓడి.. టోర్నీలో కనీసం సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. ఈ సారైనా గత ఓటమికి రివేంజ్ తీసుకోవాలని భావిస్తోంది.

సూపర్ 12 ఫార్మాట్‌లోనే..
ఎప్పటిలానే ఈ వరల్డ్‌కప్ కూడా నాకౌట్ స్టేజ్ పద్దతిలో జరగనుంది. సూపర్ 12లో ఫార్మాట్‌లో లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందు కోసం ఇప్పటికే 8 జట్లు టీ20 ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా సూపర్ 12కు అర్హత సాధించాయి. మిగిలిన 4 స్థానాల కోసం తొలి రౌండ్‌లో ఆయా జట్లను రెండు గ్రూప్‌లుగా విడదీసి క్వాలిఫైయర్ మ్యాచ్‌లు ఆడించనున్నారు. అక్టోబర్ 16 నుంచి 21 మధ్య తొలి రౌండ్ పోటీలు జరగనుండగా.. 22 నుంచి సూపర్ 12 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. నవంబర్ 6న ముగుస్తాయి. నవంబర్ 9, 10న సెమీ ఫైనల్ మ్యాచ్‌లు, 13న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

భారత్ షెడ్యూల్ ఇదే..
గ్రూప్ 1లో ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్‌తోపాటు తొలి రౌండ్‌లోని గ్రూప్ A విజేత, గ్రూప్ B రన్నరప్ ఉండనున్నాయి. ఇక గ్రూపు 2లో భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌తోపాటు తొలి రౌండ్‌లోని గ్రూప్ B విజేత, గ్రూప్ A రన్నరఫ్ ఉండనున్నాయి. తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. మెల్‌బోర్న్ వేదికగా అక్టోబర్ 23న ఈ మ్యాచ్ జరగనుంది. మిగిలిన మ్యాచ్‌ల్లో అక్టోబర్ 27న సిడ్నీ వేదికగా గ్రూప్ ఏ రన్నరఫ్‌తో, అక్టోబర్ 30న పెర్త్ వేదికగా సౌతాఫ్రికాతో, నవంబర్ 2న ఆడిలైడ్ వేదికగా బంగ్లాదేశ్‌తో, నవంబర్ 6న మెల్‌బోర్న్ వేదికగా గ్రూప్ బీ విన్నర్‌తో భారత్ తలపడనుంది.


Click it and Unblock the Notifications
