For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs PAK: వకార్.. మావోడి సౌండ్ ఎట్లుందబ్బా.. రోహిత్ సిక్సర్‌పై మంజ్రేకర్ పంచ్ డైలాగ్!(వీడియో)

India vs Pakistan: Sanjay Manjrekar trolls Waqar younis in commentary box

దుబాయ్: టీమిండియా మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈ సారి వివాదాస్పద వ్యాఖ్యానంతో కాకుండా పంచ్ డైలాగ్స్‌తో అభిమానులను అలరించాడు. ఆసియాకప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య ఆదివారం జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్‌కు మంజ్రేకర్ కామెంటేటర్‌గా వ్యవహరించాడు.

ఆసాంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో మంజ్రేకర్ సైతం తనదైన వ్యాఖ్యానంతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సహచర కామెంటేటర్, పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్‌పై తనదైన పంచ్‌లు విసిరాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్‌ను ఎగతాళి చేస్తూ అక్రమ్ మాట్లాడిన మాటలను తనదైన శైలిలో తిప్పికొట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే..

భారత్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే కేఎల్ రాహుల్ ఔటవ్వడం.. పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రోహిత్ శర్మ పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమయ్యాడు. మరోవైపు కోహ్లీ పరుగులు చేస్తుండటంతో అతనికి అండగా యాంకర్‌ రోల్ పోషించాడు. ఈ క్రమంలోనే పాక్ స్పిన్నర్ మహమ్మద్ నవాజ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ తడబడ్డాడు. అతని బ్యాట్‌ నుంచి వచ్చిన సౌండ్‌ను ప్రస్తావించిన కామెంటేటర్‌ వసీం అక్రమ్.. ఇది వినడానికి చాలా ఎబ్బెట్టుగా ఉందన్నాడు. వరల్డ్ క్లాస్ బ్యాటర్ తడబడటం చూస్తుంటే కష్టంగా అనిపిస్తుందని చెప్పాడు.

 మావోడి సౌండ్ ఎట్లుందబ్బా..

మావోడి సౌండ్ ఎట్లుందబ్బా..

ఆ కొద్ది సేపటికే రోహిత్ శర్మ నవాజ్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు. దాంతో మంజ్రేకర్ చెలరేగాడు. వకార్.. మావోడి సౌండ్ ఎట్లుందబ్బా? అంటూ సెటైర్స్ పేల్చాడు. లాంగాన్ దిశగా రోహిత్ కొట్టి సిక్స్ మైదానం బయటపడింది. అయితే ఆ వెంటనే రోహిత్ మరో సిక్సర్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔటయ్యాడు. ఇక మంజ్రేకర్ వేసిన సెటైర్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

నాతో మాట్లాడటం ఇష్టమేనా?

మ్యాచ్ అనంతరం జడేజాతో మాట్లాడుతూ నవ్వులు పూయించాడు. జడ్డూ నువ్వు నాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నావా? అని అడిగాడు. దానికి బదులుగా జడేజా నవ్వుతూ.. "అవును, అవును కచ్చితంగా మాట్లాడుతా" అంటూ సమాధానమిచ్చాడు. అనంతరం ఇద్దరూ ఒక్క సారిగా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది.

2019 వన్డే ప్రపంచకప్ సమయంలో రవీంద్ర జడేజాని 'అరకొర క్రికెటర్' అని మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. అనంతరం మంజ్రేకర్ వాఖ్యలకు జడేజా గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. "ఇప్పటికే నా కెరీర్‌లో నువ్వు ఆడిన మ్యాచ్‌లకంటే నేను రెట్టింపు ఆడాను. ఇంకా ఆడుతూనే ఉన్నాను.మొదట మనుషులను గౌరవించడం నేర్చుకోండి. ఇకనైనా ఇలాంటివి ఆపితే మంచిది" అంటూ ట్విటర్‌ వేదికగా బదులు ఇచ్చాడు. అప్పటి నుంచి వీరి మధ్య వైరం కొనసాగుతోంది.

హార్దిక్ సూపరో సూపర్..

హార్దిక్ సూపరో సూపర్..

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు కుప్పకూలింది. మహమ్మద్ రిజ్వాన్(43), షానవాజ్ దహాని(16) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో భువనేశ్వకుమార్ నాలుగు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా 3 వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు.

అర్ష్‌దీప్ సింగ్ రెండు వికెట్లు తీయగా..ఆవేశ్ ఖాన్‌కు ఓ వికెట్ దక్కింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 19.4 ఓవర్లలో 148 పరుగులు చేసి గెలుపొందింది. బౌలింగ్‌లో మెరిసిన హార్దిక్ పాండ్యా(17 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 33 నాటౌట్) బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు. అతనికి అండగా విరాట్ కోహ్లీ(35), రవీంద్ర జడేజా(35) రాణించారు. పాక్ బౌలర్లలో అరంగేట్ర పేసర్ నసీమ్ షా రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ నవాజ్ మూడు వికెట్లతో చెలరేగాడు.

Story first published: Monday, August 29, 2022, 19:06 [IST]
Other articles published on Aug 29, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+