For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs PAK:ప్చ్.. ఇంకా ప్రారంభం కానీ మ్యాచ్..!

కొలంబో: ఆసియాకప్ 2023లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్‌డే అయిన నేటికి(సోమవారం) వాయిదా పడిన విషయం తెలిసిందే. రిజర్వ్ డే రోజు కూడా ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో మైదానమంతా చిత్తడిగా మారింది.

వర్షం వస్తూ పోతూ దోబుచులాడింది. మైదాన సిబ్బంది మాత్రం మ్యాచ్‌కు గ్రౌండ్‌ను సిద్దం చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 2.35 గంటలకు ఆగిన వర్షం... 2.54కు మళ్లీ మొదలైంది. 3.03 గంటలకు మళ్లీ ఆగి 3.20 గంటలకు మళ్లీ మొదలైంది. కుండపోత వర్షం కారణంగా మైదానం మొత్తం చిత్తడిగా మారింది. ఒకవేళ వర్షం ఆగినా.. మైదానాన్ని సిద్దం చేసేందుకు చాలా సమయం పట్టనుంది. పదే పదే వర్షం వస్తే మాత్రం మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

India vs Pakistan: Rain delays start of Reserve Day

సాయంత్రానికి ఇది 80 శాతానికి పెరుగుతోంది. దీంతో రిజర్వ్ డేలో కూడా మ్యాచ్ ఆసాంతం జరిగే సూచనలు కనిపించడం లేదు. తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో కనీసం 20 ఓవర్ల మ్యాచ్ జరిగితేనే డీఎల్ఎస్ విధానంలో విజేతను నిర్ణయిస్తారు.

ఒకవేళ వర్షం కారణంగా రెండో ఇన్నింగ్స్ కనీసం 20 ఓవర్లు కూడా జరగకపోతే.. ఈ మ్యాచ్‌ను కూడా అంపైర్లు రద్దు చేస్తారు. వర్షం నేపథ్యంలో అభిమానులు చాలా మంది బీసీసీఐ సెక్రటరీ జై షాపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఆసియా కప్‌ను నాశనం చేశాడంటూ తిట్టిపోస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి 24.1 ఓవర్లలో 2 వికెట్లకు 147 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (56), శుభ్‌మన్ గిల్ (58)అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. అయితే ఈ ఇద్దరూ వరుస ఓవర్లలో పెవిలియన్ చేరారు. రోహిత్ శర్మను షాదాబ్ ఖాన్ ఔట్ చేయగా.. శుభ్‌మన్ గిల్‌ను షాహిన్ అఫ్రిది పెవిలియన్ చేర్చాడు. క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ(8)తో పాటు కేఎల్ రాహుల్(17) ఉన్నారు.

Story first published: Monday, September 11, 2023, 16:38 [IST]
Other articles published on Sep 11, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+