Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Champions Trophy 2025లో భారత షెడ్యూల్ ఇదే!

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ప్రకటించింది. ఫిబ్రవరి 19న పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. భారత్ మ్యాచ్‌లు తటస్థ వేదికైన దుబాయ్‌లో జరగనున్నాయి. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో టీమిండియా తమ క్యాంపైన్‌ను మొదలుపెట్టనుంది.

లీగ్ దశలో భారత్ మొత్తం మూడు మ్యాచ్‌లను ఆడనుంది. ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో భారత్ రెండో మ్యాచ్ ఆడనుండగా.. న్యూజిలాండ్‌తో చివరి లీగ్ మ్యాచ్‌ను మార్చి 2న ఆడనుంది. మార్చి 4న సెమీఫైనల్-1, మార్చి 5న సెమీఫైనల్-2 జరగనుండగా.. మార్చి 9న ఫైనల్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్‌లన్నీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్నాయి. భారత్ ఫైనల్ చేరితే తుది పోరుతో సహా సెమీఫైనల్ మ్యాచ్‌ దుబాయ్ వేదికగా జరగనుంది.

India vs Pakistan on February 23 as ICC announced the full schedule of the Champions Trophy 2025

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణపై నెలకొన్న అనిశ్చితికి ఐసీసీ తెరదించిన విషయం తెలిసిందే. హైబ్రిడ్ మోడల్‌లో ఈ టోర్నీ జరుగుతుందని గత వారమే ఐసీసీ ప్రకటించింది. భారత్ మ్యాచ్‌లు తటస్థ వేదికగా జరుగుతాయని వెల్లడించింది. అదే విధంగా 2027 వరకు భారత్ వేదికగా జరిగే ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్ కూడా తటస్థ వేదికగా మ్యాచ్‌లు ఆడుతుందని పేర్కొంది.

ఆటగాళ్ల భద్రత విషయంలో రాజీపడలేమని, పాకిస్థాన్‌లో పర్యటించలేమని టీమిండియా స్పష్టం చేయగా.. హైబ్రిడ్ మోడల్‌కు పాకిస్థాన్ అంగీకరించలేదు. చివరకు భారత్ వేదికగా జరిగే ఐసీసీ టోర్నీల్లో తమ మ్యాచ్‌లను తటస్థ వేదికగా నిర్వహించాలని పీసీబీ డిమాండ్ చేసింది. దాంతో ఆ డిమాండ్‌కు ఐసీసీ అంగీకరించడంతో పాటు ఓ మహిళా ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులను కూడా కేటాయించింది.

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత షెడ్యూల్..

ఫిబ్రవరి 20, 2025: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్, దుబాయ్ (మధ్యాహ్నం 2 గంటలకు)

ఫిబ్రవరి 23, 2025: భారత్ వర్సెస్ పాకిస్థాన్, దుబాయ్(మధ్యాహ్నం 2 గంటలకు)

మార్చి 2, 2025: భారత్ వర్సెస్ న్యూజిలాండ్, దుబాయ్(మధ్యాహ్నం 2 గంటలకు)

Story first published: Tuesday, December 24, 2024, 18:37 [IST]
Other articles published on Dec 24, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+