అతి త్వరలో భారత్ X పాకిస్థాన్ సిరీస్!

కరాచీ: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటేనే భావోద్వేగాల సమ్మేళనం.! మైదానంలో ఓ యుద్ధంలాంటి వాతావరణం నెలకొంటుంది.! ఇరు దేశాల అభిమానులే కాకుండా యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా చూస్తోంది. అదే ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగితే.. ఆ సిరీస్‌లో దాయాది దేశంపై టీమిండియా విజయం సాధిస్తే వచ్చే ఆనందం మాటల్లో వర్ణించలేం. కానీ ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా ధ్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే దాయాదీ జట్లు తలపడుతున్నాయి.

2021 సెకండాఫ్‌లో..
అయితే ఈ రెండు జట్లు ఈ ఏడాదిలో ఓ సిరీస్‌లో తలపడబోతున్నాయనే వార్త ఇప్పుడు చర్చనీయాంశమైంది. 2021 సెకండాఫ్‌లో రెండు జట్ల మధ్య టీ20 సిరీస్ జరిగే అవకాశాలున్నట్లు పాకిస్థాన్‌కు చెందిన స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఏడాదిలో భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌కు సిద్ధంగా ఉండాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు ఆ దేశ ప్రభుత్వ ఉన్నత వర్గాల నుంచి ఆదేశాలు అందినట్లు సదరు చానెల్ తమ కథనంలో తెలిపింది.

వన్డే ప్రపంచకప్‌లో చివరిసారిగా..
ఓ పీసీబీ అధికారి దాన్ని స్పష్టం చేశాడని పేర్కొంది. మరోవైపు తమ దేశంలో 2023లో నిర్వహించే ఆసియా కప్‌లో భారత్ ఆడుతుందనే ఆశాభావాన్ని పీసీబీ ఛైర్మన్ ఎహ్‌సాన్ మణి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చివరగా 2012-13లో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత్‌లో పాక్ పర్యటించింది. 2008లో ఆసియా కప్ కోసం టీమిండియా.. పాక్‌కు వెళ్లగా. ఈ ఇరు జట్లు 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆఖరిసారిగా తలపడ్డాయి.

భారత్‌దే పై చేయి..
పాకిస్థాన్‌పై ఏ ఫార్మాట్‌లోనైనా భారత్‌కే మెరుగైన రికార్డ్ ఉంది. ప్రపంచకప్‌లో ఇప్పటి వరకూ 7 సార్లు భారత్, పాక్ ఢీకొనగా.. అన్ని మ్యాచ్‌ల్లోనూ టీమిండియానే గెలుపొందింది. ఇక టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 5 సార్లు తలపడగా నాలుగుసార్లు భారత్ గెలవగా.. ఒక్కసారి డ్రా అయింది. ఇక మ్యాచ్‌ల పరంగ మాత్రం పాక్‌దే పైచేయి. ఇప్పటి వకు ఇరు దేశాల మధ్య 59 టెస్ట్‌లు జరగ్గా.. పాక్ 12 సార్లు గెలవగా.. భారత్ 9 సార్లే విజయం సాధించింది. 38 మ్యాచ్‌ల ఫలితం తేలలేదు. 132 వన్డేల్లో 73 పాక్ గెలవగా.. భారత్ 55 మాత్రమే విజయం సాధించింది. 4 మ్యాచ్‌లు టై అయ్యాయి. ఇక టీ20ల్లో ఇరు జట్లు 8 మ్యాచ్‌లు ఆడగా.. భారత్ అత్యధికంగా 6 సార్లు విజయం సాధించగా.. పాక్ ఒకేసారి గెలుపొందింది. మరొక మ్యాచ్ డ్రా అయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications