
బౌలౌట్‌తో షురూ..
సౌతాఫ్రికా వేదికగా జరిగిన అరంగేట్ర టీ20 ప్రపంచకప్‌లో ధోనీ నేతృత్వంలోని టీమిండియా తన ఫస్ట్ మ్యాచ్ దాయాదీతోనే ఆడింది. షెడ్యూల్ ప్రకారం స్కాట్లాండ్‌తో ఆడాల్సి ఉన్నా.. వర్షంతో ఆ మ్యాచ్ బంతిపడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. దాంతో భారత్.. దాయాదీతోనే ఫస్ట్ మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ధోనీసేన.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 141 రన్స్ చేసింది. రాబిన్ ఉతప్ప (50), ధోనీ (33), ఇర్ఫాన్ పఠాన్ (20) రాణించారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాక్.. మిస్బాఉల్‌హక్ (53), షోయబ్ మాలిక్ (20) పోరాటంతో ఏడు వికెట్ల నష్టానికి సరిగ్గా 141 పరుగులే చేయగలిగింది.
చివరి రెండు బంతులకు ఒక్క పరుగు అవసరం కాగా.. పాక్ చేతిలో ఒక వికెట్ మాత్రమే ఉంది. అయితే అప్పటికే ఫామ్‌లో ఉన్న మిస్బా రనౌట్ కావడంతో స్కోర్లు టై అయ్యాయి. దాంతో ఫలితాన్ని బౌలౌట్ పద్దతి ద్వారా తేల్చారు. ఈ పద్దతిని ముందే గ్రహించి ప్రాక్టీస్ చేసిన భారత్ బౌలౌట్‌లో ఇరగదీసింది. స్పిన్ బౌలర్లు అయిన వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, రాబిన్ ఉతప్ప వికెట్లను గురి చూసి కొట్టగా.. పాక్ బౌలర్లు విఫలమయ్యారు. దీంతో 3-0 తేడాతో బౌలౌట్‌లో టీమిండియా విజయం సాధించింది.

ఫైనల్లో మరోసారి..
ఆ టోర్నీ ఫైనల్లో కూడా భారత్-పాక్ మరోసారి తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఐదు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. గౌతమ్ గంభీర్ (75), రోహిత్ శర్మ (30) రాణించారు. అనంతరం 158 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్ 152 పరుగులకే ఆలౌటైంది. ఆర్పీ సింగ్ (3/26), ఇర్ఫాన్ పఠాన్ (3/16), జోగిందర్ శర్మ (2/20) అద్భుత బౌలింగ్‌తో భారత్ చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది.
ఆఖరి ఓవర్‌లో 13 పరుగులు అవసరం కాగా.. జోగిందర్ శర్మ వేసిన ఆ ఓవర్‌లో మరోసారి మిస్సా ఉల్ హక్ ఆఖరి వికెట్‌గా క్యాచ్ ఔటయ్యాడు. తన ఫేవరేట్ పెడల్ స్వీప్ షాట్ ఆడి ఫైన్ లెగ్‌లో శ్రీశాంత్‌కు చిక్కాడు. దాంతో తొలి టీ20 ప్రపంచకప్ భారత్ వశమైంది.

మళ్లీ 2012లో..
రెండు ఎడిషన్ల(2009, 2010) తర్వాత భారత్-పాక్ జట్లు 2012లో తలపడ్డాయి. సూపర్-8 లీగ్ దశలో తొలుత పాక్‌ను 128 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ (78) ఒంటి చేత్తో విజయాన్నందించాడు. అయితే మిగిలిన మ్యాచుల్లో భారత్ ఓడిపోవడం, నెట్‌రన్‌రేట్ మెరుగ్గా ఉండటంతో ఆసీస్, పాక్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాయి. భారత్ ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. ఆ తదుపరి ఎడిషన్ 2014లోనూ ఇరు దేశాలు తలపడ్డాయి.
ఇరు జట్లు ఒకే గ్రూప్‌లో ఉండగా.. భారత బౌలర్లు సమష్టిగా రాణించి పాక్‌ను 131/7 స్కోరుకే పరిమితం చేశారు. అనంతరం బ్యాటర్లు సమయోచిత ఇన్నింగ్స్‌లతో టీమిండియా అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. గ్రూప్‌లోనే టాప్‌లో నిలిచి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లోనూ దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్ ఫైనల్‌కు చేరింది. టేటిల్ గెలుస్తుందని భావించినా.. శ్రీలంక చేతిలో ఓటమిపాలైంది.

2016లోనూ అదే ఫలితం..
భారత్ వేదికగా జరిగిన 2016 టీ20 ప్రపంచకప్‌లోనూ ఇరు దేశాలు ఒకే గ్రూప్‌లో ఉండటంతో మరోసారి తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్ చేతిలో భారత్ 79 పరుగులకే ఆలౌటై చిత్తుగా ఓడటంతో పాక్ విజయం సులువనుకున్నారంతా. కానీ భారత్ దుమ్మురేపింది. ఈడెన్ గార్డెన్స్‌లో ఔట్‌ఫీల్డ్ తడిగా ఉండటంతో మ్యాచ్‌ను 18 ఓవర్లకే కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్‌ను 118/5 స్కోరుకే భారత్ కట్టడి చేసింది.
అనంతరం టీమిండియా నాలుగు వికెట్లు నష్టపోయి 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది. అయితే సెమీఫైనల్‌లో భారత్‌కు భంగపాటు తప్పలేదు. వెస్టిండీస్ చేతిలో ఓటమి చవిచూసింది. మళ్లీ దుబాయ్ వేదికగా ఇరు జట్లు తలపడుతున్నాయి. భారత్ తమకు అలవాటైరీతిలో ఆధిపత్యం చెలాయిస్తుందా? లేక పాక్ లెక్క సరిచేస్తుందా? అనేది తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications
