India vs Pakistan: హాట్‌కేకుల్లా నిమిషాల్లోనే అమ్ముడైన టికెట్లు!

న్యూఢిల్లీ: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటేనే భావోద్వేగాల సమ్మేళనం.! మైదానంలో ఓ యుద్ధంలాంటి వాతావరణం నెలకొంటుంది.! ఇరు దేశాల అభిమానులే కాకుండా యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా చూస్తోంది. ఆ పోరుకు ఆసియా కప్ వంటి మెగా టోర్నీ వేదికగా అయితే ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేం. ఆసియా కప్‌లో భాగంగా ఆగస్టు 28న దుబాయ్ వేదికగా దాయాదీ దేశాలు తలపడనున్నాయి. అయితే భారత్-పాక్ మ్యాచ్ ఉండే క్రేజ్ నిర్వాహకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల కోసం అభిమానులు ఎగబడ్డారు.

ఆరున్నర నిమిషాల్లోనే..
సోమవారం టికెట్లను అందుబాటులో ఉంచిన ఆరున్నర నిమిషాల్లోనే మొత్తం హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. దీంతో టికెట్లు లభించక చాలా మంది నిరాశకు గురయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు అమ్మకాలు ఉంటాయని నిర్వహకులు ముందుగానే ప్రకటించడంతో టికెట్ల కోసం అభిమానులు పోటీపడ్డారు. సుమారు 75 వేల మంది టికెట్ల కోసం ఒకేసారి లాగిన్ అవ్వడంతో అధికారిక వెబ్‌సైట్ క్రాష్ అయ్యింది. రద్దీని నియంత్రించేందుకు నిర్వహకులు సైట్‌లో క్యూ సిస్టమ్‌ను తీసుకొచ్చారు. దీంతో మధ్యాహ్నం 12 గంటల వరకే ఏడున్నర లక్షల మంది బుకింగ్ చేసుకున్నారు. అయితే టికెట్లు తక్కువగా ఉండటంతో రాత్రి అమ్మకాలు మొదలుపెట్టిన నిమిషాల్లోనే మొత్తం అయిపోయాయి.

పక్కదారి పట్టించారు..
అయితే టికెట్ల అమ్మకాల విషయంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) నిబంధనలు పాటించలేదని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఆగస్టు 15న అమ్ముతామని చెప్పి నిమిషాల్లో వ్యవధిల్లోనే అయిపోయ్యానని పేర్కొన్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా టికెట్ల విషయంపై ఏసీసీకి మెయిల్ చేసినా.. టికెట్ కౌంటర్స్ వద్ద సంప్రదించినా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మండిపడుతున్నారు. టికెట్ల అమ్మకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరగాయని ఆరోపిస్తున్నారు. తెలిసినవారికి టికెట్లు అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ద్వైపాక్షిక సిరీస్‌లు లేకపోవడంతో..
ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దుల ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. దాంతో ఈ రెండు జట్ల మధ్య పోరు ఎప్పుడూ ఆసక్తికరంగా మారింది. ఇరు దేశాల అభిమానులే కాకుండా యావత్ క్రికెట్ ప్రపంచం ఈ హైఓల్టేజ్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తోంది. ఈ క్రేజ్‌ను ఐసీసీతో పాటు బ్రాడ్ కాస్టింగ్ చానెల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. ఆ క్రమంలోనే ప్రతీ టోర్నీలో ఇరు జట్లు తలపడేలా షెడ్యూల్ రూపొందిస్తున్నాయి. ఆసియా క్రికెట్ కౌన్సిల్ సైతం ఈ ఫార్మూలాను ఫాలో అయ్యింది. ఆసియాకప్‌లో భాగంగా ఆగస్టు 28న ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరిగేలా షెడ్యూల్ రూపొందించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications