న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసియా కప్: మ్యాచ్‌కి హైలెట్‌గా మారిన రోహిత్ సిక్సు(వీడియో)

Asia Cup 2018 : Rohit Sharma' Six Plays A Vital Role In Match
India vs Pakistan Asia Cup 2018, Highlights: Rohit, Dhawan help India make light work of Pakistan

న్యూ ఢిల్లీ: ఆసియా కప్‌ పోరులో దాయాది దేశం పాకిస్థాన్‌ను చిత్తుచేసింది టీమిండియా. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 43.1 ఓవర్లకు కేవలం 162 పరుగులు చేయగలిగింది. ఈక్రమంలో చేధనకు దిగిన భారత్ సునాయాసంగా పాక్‌పై జయభేరీ మోగించింది. బ్యాటింగ్‌లో భారత కెప్టెన్‌ రోహిత్‌శర్మ జోరుగా ఆడాడు. రోహిత్‌ విధ్వంసానికి పాక్‌ బౌలర్లు బెంబేలెత్తిపోయారు.

సిక్స్‌ను చూసి గ్యాలరీ మొత్తం కేరింతలతో :

‌ఫ్రీ హిట్‌కు అతను మిడ్‌వికెట్‌ దిశగా బాదిన బంతి స్టాండ్స్‌లో పడింది. ఈ సిక్స్‌ను చూసి గ్యాలరీ మొత్తం అభిమానుల కేరింతలతో మార్మోగిపోయింది. రోహిత్‌ సిక్స్‌ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ అంటూ అభిమానులు పొగడ్తలతో ముంచెత్తారు. రోహిత్‌తో కలిసి మరో ఓపెనర్‌ ధావన్‌ కూడా చెలరేగి ఆడి జట్టు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

బౌలర్లతో పాటు బ్యాట్స్‌మెన్ అదే సత్తాతో:

బౌలర్లతో పాటు బ్యాట్స్‌మెన్ అదే సత్తాతో:

వరుస వికెట్లు పడగొడుతూ.. తక్కువ స్కోరుకే పాక్‌ జట్టును కట్టడి చేసిన భారత్‌.. ఛేదన్‌లోనూ అదే సత్తా చూపించింది. అలవోకగా బౌండరీలు బాదేసింది. భారీ షాట్లు ఆడి తక్కువ వ్యవధిలోనే విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ బ్యాట్స్‌మన్‌ మనీష్‌ పాండే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

కళ్లు చెదిరే రీతిలో క్యాచ్‌ పట్టి

కళ్లు చెదిరే రీతిలో క్యాచ్‌ పట్టి

ఫైనల్‌ 11లో లేకపోయినా సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి పాక్‌ జట్టులో కీలక వికెట్‌ను పడగొట్టాడు. కళ్లు చెదిరే రీతిలో క్యాచ్‌ పట్టి టీమిండియా విజయంలో కీలక భాగస్వామి అయ్యాడు. తీవ్రమైన వెన్నునొప్పితో హార్దిక్‌ పాండ్యా అర్ధంతరంగా మైదానాన్ని వీడాడు. దీంతో అతడి స్థానంలో మనీష్‌ పాండే సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. 24వ ఓవర్‌లో కేదార్‌ జాదవ్‌ వేసిన ఐదో బంతిని పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ రిస్క్‌ చేసి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అది కాస్తా పాండే చేతికి చిక్కింది.

మ్యాచ్ గెలిపించింది.. బౌలర్లే: రోహిత్ శర్మ

అదుపు తప్పేలా ఉండటంతో గాల్లోకి విసిరేసి

బంతిని అందుకున్నాక అదుపు తప్పేలా ఉండటంతో పాండే బంతిని గాల్లోకి విసిరేశాడు. ఆ తర్వాత బౌండరీ అవతలి వైపుకు వెళ్లి వెంటనే లోపలికి వచ్చి మళ్లీ బంతిని అందుకున్నాడు. ఇదంతా క్షణాల వ్యవధిలో జరిగిపోయింది. పాండే అద్భుత క్యాచ్‌ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. తుది జట్టులో లేకపోయినా సూపర్‌ ఫీల్డింగ్‌ చేశాడంటూ నెటిజన్లు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Story first published: Thursday, September 20, 2018, 13:11 [IST]
Other articles published on Sep 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X