IND vs NZ, 3rd T20I: ధోని రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ

హామిల్టన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో 38 పరుగులు చేసిన కోహ్లీ.. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. ఫలితంగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన తొలి భారత కెప్టెన్‌గా నిలిచాడు. ఇప్పటి వరకు ఈ ఘనత 1,112 పరుగులతో ధోని పేరిట ఉండగా.. తాజా మ్యాచ్‌తో విరాట్ అధిగమించాడు.
ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డుకు 25 పరుగుల దూరంలో ఉన్న కోహ్లీ.. సోదీ వేసిన 16 ఓవర్ నాలుగో బంతికి సింగిల్ తీసి ఈ ఘనతను అందుకున్నాడు. ఇక ధోని 72 మ్యాచ్‌ల్లో 37.6 సగటుతో 1,112 పరుగులతో ఈ రికార్డ్ అందుకోగా.. కోహ్లీ కేవలం 37 మ్యాచ్‌ల్లోనే ఈ ఫీట్ సాధించాడు.
ఇక ఓవరాల్‌గా దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ 1,273 పరుగులతో ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 1,148 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ(1126)తో తర్వాతి స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లీ 27 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్‌తో 38 పరుగులు చేసి హమిష్ బెనెట్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇప్పటి వరకూ 81 టీ20 మ్యాచ్‌లాడిన విరాట్ కోహ్లీ 2,783 పరుగులతో అగ్ర స్థానంలో కొనసాగుతుండగా.. రోహిత్ శర్మ 106 మ్యాచ్‌ల్లో 2,713 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
ఇక ఇదే మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ అరుదైన రికార్డు సాధించాడు. మూడు ఫార్మాట్లలో కలిపి ఓపెనర్‌గా 10,000 పరుగుల మార్క్‌ను ధాటాడు. కేవలం 219 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అందుకున్న రోహిత్.. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన రెండో క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసి ఆతిథ్య జట్టు ముందు 180 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications