Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెండో టెస్ట్ ముందు లంబూను ఊరిస్తున్న ‘ట్రిపుల్ సెంచరీ’రికార్డు

India vs New Zealand: Ishant Sharma just three wickets away from achieving magnificent Test record

క్రిస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్‌తో శనివారం ప్రారంభం కానున్న రెండో టెస్ట్ ముందు టీమిండియా స్టార్ పేసర్‌ ఇషాంత్‌ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. తొలి టెస్ట్‌లో ఐదు వికెట్లతో చెలరేగిన లంబూ .. రెండో టెస్ట్‌లో మరో అరుదైన ఘనతను అందుకోనున్నాడు. సంప్రదాయక ఫార్మాట్‌లో 'ట్రిపుల్‌ సెంచరీ'క్లబ్‌లో చేరడానికి మూడు అడుగుల దూరంలో నిలిచాడు.

ఐదుగురు మాత్రమే..

తన టెస్టు కెరీర్‌లో ఇప్పటివరకూ 297 వికెట్లను తీసిన ఇషాంత్.. మరో మూడు వికెట్లు తీస్తే ఈ ట్రిపుల్ రికార్డును సొంతం చేసుకుంటాడు. రెండో టెస్టులో ఇషాంత్‌ ఈ ఫీట్‌ సాధించే అవకాశం ఉంది. ఇప్పటివరకూ భారత్‌ తరఫున ఐదుగురు మాత్రమే మూడొందల టెస్టు వికెట్ల క్లబ్‌లో చేరారు. అనిల్‌ కుంబ్లే(619), కపిల్‌దేవ్‌(434), హర్భజన్‌ సింగ్‌(417), అశ్విన్‌(365), జహీర్‌ఖాన్‌(311)లు మాత్రమే మూడొందల వికెట్లను సాధించిన భారత బౌలర్లు కాగా... వీరిలో కపిల్‌దేవ్‌, జహీర్‌ఖాన్‌లు పేసర్లు మిగతా ముగ్గురు స్పిన్నర్లు.

అత్యధిక టెస్టులు ఆడిన..

అత్యధిక టెస్టులు ఆడిన..

మూడొందల టెస్టు వికెట్లు సాధించే క్రమంలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ డానియల్‌ వెటోరి పేరిట ఉంది. వెటోరి 94వ టెస్టులో 300 వికెట్ల మార్కును చేరుకున్నాడు. దీన్ని ఇషాంత్‌ బ్రేక్‌ చేయనున్నాడు. న్యూజిలాండ్‌తో రెండో టెస్టు ఇషాంత్‌కు 98వ మ్యాచ్‌ కానుంది. దాంతో వెటోరీ 94 టెస్టుల రికార్డును ఇషాంత్‌ అధిగమించనున్నాడు.

తొలి టెస్ట్‌లోనే రికార్డు..

తొలి టెస్ట్‌లోనే రికార్డు..

ఫస్ట్ టెస్ట్‌లోనే 5 వికెట్లు పడగొట్టి టెస్టు కెరీర్‌లో ఐదు వికెట్లను 11వ సారి సాధించిన రెండో బౌలర్‌గా భారత పేసర్‌ జహీర్‌ ఖాన్ సరసన నిలిచాడు. జహీర్‌ 92 టెస్టుల్లో 11 సార్లు ఐదు వికెట్లు పడగొట్టగా.. ఇషాంత్‌ 97 టెస్టుల్లో ఈ ఘనతను అందుకున్నాడు. ఈ జాబితాలో కపిల్‌ దేవ్‌(23) అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక విదేశీ గడ్డపై ఎక్కువ సార్లు ఐదు వికెట్లు(9) పడగొట్టిన మూడో టీమిండియా బౌలర్‌గా లంబూ నిలిచాడు.

2018 నుంచి రెగ్యులర్ ఆటగాడిగా..

2018 నుంచి రెగ్యులర్ ఆటగాడిగా..

టీమిండియాలో రెగ్యులర్‌ ఆటగాడిగా మారడానికి ఇషాంత్‌కు మంచి బ్రేక్‌ వచ్చింది మాత్రం 2018లోనే. ఆ ఏడాది నుంచి ఇషాంత్‌ శర్మ భారత టెస్టు జట్టులో రెగ్యులర్‌ ఆటగాడిగా మారిపోయాడు. 2018 నుంచి ఇప్పటివరకూ ఇషాంత్‌ శర్మ 71 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే 19.14 యావరేజ్‌ సాధించాడు. ఫలితంగా కనీసం 50 వికెట్లు సాధించిన పేసర్ల యావరేజ్‌ జాబితాలో ఇషాంత్‌ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు.

Story first published: Thursday, February 27, 2020, 17:45 [IST]
Other articles published on Feb 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+