టీమిండియా తదుపరి షెడ్యూల్ ఎప్పుడంటే?
సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ విజయంతో ఈ ఏడాదిని టీమిండియా ఘనంగా ముగించింది. వచ్చే ఏడాదే టీమిండియా తదుపరి సిరీస్ ఆడనుంది. జనవరి 11 నుంచి సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్, జనవరి 21 నుంచి ఐదు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ముందు ఇదే చివరి టీ20 సిరీస్ కావడం గమనార్హం. దాంతో ఈ సిరీస్‌లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సౌతాఫ్రికాతో సిరీస్ అనంతరం టీమిండియా ఆటగాళ్లకు 20 రోజుల విశ్రాంతి లభించింది. ప్రస్తుతం ఆటగాళ్లంతా స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఇందులో కొందరు విజయ్ హజారే ట్రోఫీ ఆడనుండగా.. మరికొందరు విశ్రాంతి తీసుకోనున్నారు.

మూడు వన్డేల సిరీస్..
జనవరి 1 నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా మాజీ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నారు. జనవరి 11 వడదోరా వేదికగా తొలి మ్యాచ్ జరగనుండగా.. జనవరి 14న రాజ్‌కోట్ వేదికగా రెండో వన్డే, జనవరి 18న ఇండోర్ వేదికగా మూడో వన్డే జరగనుంది. వన్డే మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.
జనవరి 21 నుంచి టీ20 సిరీస్..
న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్ జనవరి 21 నుంచి ప్రారంభం కానుంది. జనవరి 21న నాగ్‌పూర్‌లో తొలి టీ20, జనవరి 23న రాయ్‌పూర్ వేదికగా రెండో టీ20, జనవరి 25న గువహతి వేదికగా మూడో టీ20, జనవరి 28న విశాఖపట్నంలో నాలుగో టీ20, జనవరి 31న తిరువనంతపురంలో ఐదో టీ20 జరగనుంది. టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి ముందు టీమిండియా ఆడే చివరి టోర్నీ ఇదే కావడంతో ఈ సిరీస్‌పై ఆసక్తి నెలకొంది. టీ20 ప్రపంచకప్ 2025 కోసం ప్రకటించిన జట్టే ఈ సిరీస్ ఆడనుంది. వన్డే సిరీస్‌కు ఇంకా టీమ్ ప్రకటించలేదు.
భారత టీ20 టీమ్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వరుణ్ చక్రవర్తి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications