For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs New Zealand తొలి మ్యాచ్‌లో గెలిచినా.. కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఘోర తప్పిదం!

India vs New Zealand: Experts and Fans Points Tactical Mistake From Rohit Sharma In 1st T20I

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా జైపూర్ వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20లో సమష్టిగా రాణించిన భారత్ ఐదు వికెట్లతో గెలుపొందింది. టీ20 సారథ్య బాధ్యతలను విరాట్ కోహ్లీ వదిలేయడంతో ఆ బాధ్యతలను రోహిత్ శర్మ స్వీకరించాడు. ఫస్ట్ మ్యాచ్‌లోనే తన మార్క్ కెప్టెన్సీతో జట్టుకు విజయాన్నందించాడు. కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి శుభారంభాన్ని అందుకున్నాడు.

సూపర్ కెప్టెన్సీ..

సూపర్ కెప్టెన్సీ..

ఈ మ్యాచ్ ఆసాంతం రోహిత్ శర్మ కెప్టెన్సీ బాగుంది. కుర్రాళ్లకు విలువైన సలహాలిస్తూ మైదానంలో చురుగ్గా కదిలాడు. అటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు. బౌలర్లు పరుగులు భారీగా ఇచ్చినప్పుడు వాళ్ల దగ్గరికి వెళ్లి ప్రొత్సహించాడు. ఫీల్డ్ సెటప్, బంతులు వేసే విషయంలో వారికి పూర్తి స్వేచ్చనిస్తూ విలువైన సలహాలు ఇచ్చాడు. మైదానంలో ప్రశాంతంగా ఉంటూ ధోనీని తలపించాడు. బ్యాటింగ్‌లో కెప్టెన్సీ ఇన్నింగ్స్ కూడా ఆడాడు. అయితే, ఫస్ట్ మ్యాచులోనే రోహిత్ శర్మ ఓ తప్పిదం చేశాడు. ప్రస్తుతం ఈ తప్పిదాన్నే అభిమానులు, విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

వెంకటేశ్ అయ్యర్ అరంగేట్రం..

వెంకటేశ్ అయ్యర్ అరంగేట్రం..

స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయంగా ఐపీఎల్‌లో సత్తా చాటిన వెంకటేశ్ అయ్యర్‌ను తీర్చిదిద్దాలని టీమ్‌మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అందులో భాగంగానే వెంకటేశ్ అయ్యర్‌ను ఈ సిరీస్‌కు ఎంపిక చేసి ఫస్ట్ మ్యాచ్‌లోనే భారత్ తరఫున అరంగేట్రం చేయించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చేతుల మీదుగానే వెంకటేశ్ అరంగేట్ర క్యాప్‌ కూడా అందుకున్నాడు. కానీ తీరా మ్యాచ్‌లో రోహిత్ శర్మ అతని సేవలను పెద్దగా ఉపయోగించుకోలేదు. ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయించలేదు.

బౌలింగ్ ఇవ్వకుండా..

బౌలింగ్ ఇవ్వకుండా..

ఇదే అభిమానులు, విశ్లేషకులకు నచ్చలేదు. ఫాస్ట్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా వెంకటేశ్‌ అయ్యర్‌ను జట్టులోకి తీసుకొని అతనికి ఒక్క ఓవర్ కూడా ఇవ్వకపోవడం ఏంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకొని ప్రత్యర్థి టీమ్ పరుగులు తీయడానికి ఇబ్బంది పడుతున్న వేళ వెంకటేశ్ అయ్యర్ ఇవ్వాల్సిందంటున్నారు. ఆ సమయంలో దీపక్ చాహర్, సిరాజ్‌లు సైతం తడబడ్డారని గుర్తు చేస్తున్నారు. కానీ రోహిత్ మాత్రం అతను బౌలరనే విషయాన్ని మర్చిపోయాడంటున్నారు. అలాగే బ్యాటింగ్ లో కూడా వెంకటేష్ అయ్యర్‌కు సరైన అవకాశం ఇవ్వలేదని, శ్రేయస్ అయ్యర్ కన్నా ముందే వెంకటేశ్ అయ్యర్ ను బ్యాటింగ్ లో దింపితే ఫలితం బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

సూర్య సూపర్ బ్యాటింగ్..

సూర్య సూపర్ బ్యాటింగ్..

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. మార్టిన్‌ గప్టిల్‌ (42 బంతుల్లో 70; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), మార్క్‌ చాప్‌మన్‌ (50 బంతుల్లో 63; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం భారత్‌ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు సాధించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (40 బంతుల్లో 62; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (36 బంతుల్లో 48; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు.

Story first published: Thursday, November 18, 2021, 17:30 [IST]
Other articles published on Nov 18, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+