Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: చెలరేగిన కాన్వే, మిచెల్.. భారత్‌ ముందు టఫ్ టార్గెట్!

India vs New Zealand: Devon Conway and Daryl Mitchells blazing 59 takes NZ to 176/6

రాంచీ: భారత్‌తో తొలి టీ20లో న్యూజిలాండ్ బ్యాటర్లు డేవాన్ కాన్వే(35 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 52), డారిల్ మిచెల్(30 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 59 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దాంతో భారత్‌ ముందు 177 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్‌కు తోడుగా ఫిన్ అలెన్(35) రాణించాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, శివమ్ మావి తలో వికెట్ తీసారు.

ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే శుభారంభం అందించారు. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన ఈ జోడీని సుందర్ విడదీసాడు. ఫిన్ అలెన్‌ను క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్ చేర్చి తొలి వికెట్‌కు నమోదైన 43 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అదే ఓవర్ చివరి బంతికి క్రీజులోకి వచ్చిన మార్క్ చాప్‌మన్(0)ను సుందర్ స్టన్నింగ్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన గ్లేన్ ఫిలిప్స్(17)‌తో డెవాన్ కాన్వే ఇన్నింగ్స్‌ను ముందుకు నడపించాడు. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగిన కాన్వే 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని కుల్దీప్ యాదవ్ విడదీసాడు.

గ్లేన్ ఫిలిప్స్‌ను క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 60 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి డారిల్ మిచెల్ రాగా.. హాఫ్ సెంచరీ హీరో కాన్వేను అర్ష్‌దీప్ సింగ్ ఔట్ చేశాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన డేంజరస్ మైకేల్ బ్రేస్‌వెల్(1)ను ఇషాన్ కిషన్ రనౌట్ చేశాడు. చివర్లో మిచెల్ సాంట్నర్(7) విఫలమైనా.. డారిల్ మిచెల్ హాఫ్ సెంచరీతో జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ అందించాడు.

Story first published: Friday, January 27, 2023, 21:06 [IST]
Other articles published on Jan 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+