
సౌతాంప్టన్: క్రికెట్ అభిమానులకు శుభవార్త. ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షపైనల్ నాలుగో రోజు ఆట ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మెగా ఫైనల్‌కు వేదికైన సౌతాంప్టన్‌లో ఉదయం నుంచి వర్షం కురుస్తుండటంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. అయితే ప్రస్తుతం అక్కడ వర్షం ఆగిందని, అంతేకాకుండా మబ్బులు కూడా పోయాయని ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ క్రిక్ బజ్ తెలిపింది. మళ్లీ వర్ష వచ్చే అవకాశం లేకుంటే మ్యాచ్ ప్రారంభం కానుంది.
వర్షం ఆగినప్పటికీ మైదానంలో పిచ్‌పై కప్పిన కవర్లపై నీరు నిలిచింది. ఔట్‌ఫీల్డ్ చిత్తడిగా మారింది. అక్కడక్కడా వరద నీరు చేరింది. మైదానా సిబ్బంది వీటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అంపైర్లు ఆటకు సాధ్యమవుతుందా? లేదని పరిశీలించనున్నారు. మరికొద్ది సేపట్లోనే మనకు నాలుగో రోజు ఆటకు సంబంధించి కీలక అప్‌డేట్ రానుంది.
ఇక ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో ఆటగాళ్లు తమ వ్యాపకాల్లో మునిగిపోయారు. న్యూజిలాండ్ క్రికెటర్లు టేబుల్ టెన్నిస్ ఆడుకుంటున్నారు. మరికొందరు ముచ్చట్లు పెడుతున్నారు. ఇంకొందరు డ్రస్సింగ్ రూమ్ బాల్కనీల్లో వెచ్చని కాఫీలు ఆస్వాదిస్తున్నారు. సౌతాంప్టన్‌లో పరిస్థితిని బీసీసీఐ సైతం ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ఆట ఆలస్యంగా ఆరంభమయ్యేలా ఉందని పేర్కొంది. వాస్తవంగా ఈ రోజంతా వర్షం పడుతుతందని వాతావరణ శాఖ తెలిపింది. మరీ ప్రస్తుతం వర్షం తగినప్పటికీ మ్యాచ్ జరుగుతుందో లేదో చూడాలి.
మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ తొలి ఇన్నింగ్స్ 92.1 ఓవర్లలో 217 పరుగుల వద్ద ముగిసింది. రహానే (190 బంతుల్లో 5 ఫోర్లతో 49), కోహ్లీ (196 బంతుల్లో 1ఫోర్‌తో 44) రాణించారు. బౌల్ట్, వాగ్నర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత న్యూజిలాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. భారత స్కోరుకు 116 పరుగుల దూరంలో నిలిచింది. విలియమ్సన్ (12 బ్యాటింగ్), రాస్ టేలర్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అశ్విన్, ఇషాంత్‌కు చెరో వికెట్ దక్కింది.