Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs NZ: తొలి రోజు ఆట వర్షార్పణం..!

భారత్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి టెస్ట్‌కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. బెంగళూరు వేదికగా బుధవారం ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్‌కు వరణుడు అడ్డంకిగా మారాడు. భారీ వర్షం కారణంగా తొలి రోజు ఆటను అంపైర్లు రద్దు చేశారు. కనీసం టాస్ కూడా పడలేదు.

వరణుడు దాగుడు మూతలు ఆడటంతో ఆట సాధ్యమవ్వలేదు. మ్యాచ్ వేదిక అయిన చిన్నస్వామి స్టేడియంలో అత్యాధునిక డ్రైనేజి వ్యవస్థ ఉన్న ఫలితం లేకపోయింది. పలు మార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు తొలి రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో అభిమానులు తీవ్ర నిరాశగా మైదానం వీడారు.

India vs New Zealand Day 1 of first Test called off due to rain in Bengaluru

వర్షం ఆగితేనే గురువారం ఆట సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. వారం రోజుల పాటు బెంగళూరులో భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే బెంగళూరుతో పాటు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ బెర్త్‌ దక్కించుకోవాలంటే ఈ సిరీస్ గెలవడం టీమిండియాకు ఎంతో కీలకం.

జట్ల వివరాలు
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్).

న్యూజిలాండ్: టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్, మైకేల్ బ్రేస్‌వెల్ (తొలి టెస్టుకు మాత్రమే), మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, విల్ ఒరుర్కే, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, బెన్ సీర్స్, ఇష్ సోథి (2,3 టెస్టులకు), టిమ్ సౌథి, కేన్ విలియమ్సన్, విల్ యంగ్.

Story first published: Wednesday, October 16, 2024, 15:44 [IST]
Other articles published on Oct 16, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+