For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs New Zealand: కివీస్ లక్ష్యం 540.. విజయం దిశగా భారత్

India vs New Zealand: Ashwin on a roll as New Zealand rocked in 540 chase
ND VS NZ: India 5 Wickets Away From Victory, NZ Need 400 Runs To Win | Oneindia Telugu

ముంబై: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా విజయం దిశగా దూసుకెళ్తుంది. 69/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టు 276/7 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దాంతో ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకొని 540 పరుగుల భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందు ఉంచింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్.. అప్పుడే మూడు వికెట్లు కోల్పోయింది. భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ధాటికి కివీస్ ఓపెనర్ టామ్ లాథమ్(6), విల్ యంగ్(20), రాస్ టేలర్(6) పెవిలియన్ చేరారు. దాంతో 55 పరుగులకే కివీస్ మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో డారిల్ మిచెల్(20 బ్యాటింగ్), హెన్రీ నికోల్స్(0 బ్యాటింగ్) ఉన్నారు.

అంతకు ముందు మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. విరాట్ కోహ్లీ (36), శుభ్‌మన్ గిల్ (47), అక్షర్ పటేల్ (41 నాటౌట్) రాణించడంతో మెరుగైన స్కోర్ సాధించింది. దీంతో ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యం నిలిచింది.తొలి ఇన్నింగ్స్​లో తొలుత బ్యాటింగ్​ చేసిన భారత్.. 325 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్( 150) పరుగులతో రాణించగా, గిల్ (44), అక్షర్ పటేల్( 52) పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఒక్కడే 10 వికెట్లూ తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కివీస్.. 62 పరుగులకే తొలి ఇన్నింగ్స్​లో ఆలౌటైంది. మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు తీయగా.. అశ్విన్ నాలుగు వికెట్లతో ఆ జట్టు పతనాన్ని శాసించారు. అక్షర్ పటేల్, జయంత్ యాదవ్ తలో వికెట్ తీశారు.

Story first published: Sunday, December 5, 2021, 15:38 [IST]
Other articles published on Dec 5, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+