Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs New Zealand 5th T20I: ప్చ్.. శాంసన్ మళ్లీ విఫలం, అవకాశాలు రాలేదంటివి, ఇస్తే ఆడకపోతివి.!

India vs New Zealand 5th T20I: Twitter Trolls Sanju Samson As He Throws Away His Wicket Again

మౌంట్‌ మాంగనుయ్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఆఖరి టీ20లో టీమిండియా యువ బ్యాట్స్‌మన్ సంజూశాంసన్ విఫలయ్యాడు. 5 బంతుల్లో రెండు పరుగులే చేసి దారుణంగా విఫలమయ్యాడు. రెండో ఓవర్‌లో కుగ్‌లిన్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ మీదుగా వేసిన బంతిని.. అంచనా వేయలేకపోయిన కేరళ బ్యాట్స్‌మన్ షార్ట్ కవర్స్ మీదుగా భారీ షాట్‌కు ప్రయత్నంచి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దీంతో తనకు దక్కిన సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

గత మ్యాచ్‌లో సిక్స్ కొట్టి అనంతరం అదే ఊపులో మరో పేలవ షాట్‌కు ప్రయత్నంచి ఔటైనా సంజూ.. తాజా మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. 2015లో జింబాబ్వేపై తొలి టీ20 ఆడిన సంజూ.. తర్వాత సుమారు ఐదేళ్ల పాటు జట్టుకు దూర‌మ‌య్యాడు. ఇక గ‌త‌నెల‌లో శ్రీలంక‌తో జ‌రిగిన టీ20 సిరీస్‌లో త‌న‌కు తుదిజ‌ట్టులో ఆడే అవ‌కాశం వ‌చ్చింది. ఆ మ్యాచ్‌లో కేవ‌లం రెండు బంతులాడిన శాంస‌న్.. ఒక సిక్స‌ర్ కొట్టి మ‌రుస‌టి బంతికే ఔట‌య్యాడు. దీంతో అతనికి మళ్లీ అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుత న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. కానీ ధావన్ గాయపడటంతో మళ్లీ పిలుపు అందుకున్నాడు. తొలి మూడు మ్యాచ్‌లు చోటు కోసం నిరీక్షించిన శాంసన్.. తర్వాత రిషభ్ పంత్‌ను కాదని దక్కిన రెండు అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయాడు. దీంతో అభిమానులు శాంసన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

'అవకాశాలు ఇవ్వడం లేదన్నావు.. ఇస్తే ఆడవ్.. ఏంది శాంసన్' అంటూ మండిపడుతున్నారు. పంత్‌ను కాదనిచ్చిన చాన్స్‌తో నిరూపించుకోవాల్సింది పోయి.. ఆదిలోనే అంత అత్యుత్సాహం ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత మ్యాచ్ గుణపాఠం నేర్చుకోలేదని విమర్శిస్తున్నారు.

అసలు పిచ్‌ పరిస్థితిని అర్థం చేసుకోకుండా అలా ఆడటం అతని దుందుడుకు స్వభావానికి అద్దం పడుతోందని విమర్శిస్తున్నారు. ఐదేళ్ల తర్వాత శాంసన్‌కు వచ్చిన రెండో అవకాశం కూడా పోయిందని అతని అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిర్లక్ష్యంగా ఆడే పంత్ వైరస్ ఏమైనా శాంసన్‌కు అంటిందా ఏందని సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో పేస‌ర్ కుగిలైన్.. వికెట్‌కు దూరంగా వేసిన ఓవర్ పిచ్ బంతిని, మ‌రో బ్యాట్స్‌మ‌న్ అయితే స్టాండ్స్‌లోకి పంపేవారని, కానీ శాంస‌న్ మాత్రం శ‌రీరానికి దూరంగా డ్రైవ్ ఆడుతూ.. షార్ట్ క‌వ‌ర్‌లో మిచెల్ సాంట్న‌ర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్‌కు చేరాడని అతని ఔట్‌ను విశ్లేషిస్తున్నారు. వచ్చిన మూడు అవకాశాలను చేజార్చుకోవడంతో శాంస‌న్‌కు రాబోయే టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ఎంపిక‌య్యే అవ‌కాశాలు స‌న్న‌గిల్లాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Story first published: Sunday, February 2, 2020, 13:43 [IST]
Other articles published on Feb 2, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+