Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs New Zealand 5th T20I: రాస్ టేలర్ ‘సెంచరీ’.. ఖాతాలో అరుదైన ఘనత

India vs New Zealand 5th T20I: Ross Taylor becomes only the third player to play 100 mens T20Is

మౌంట్‌ మాంగనుయ్‌: భారత్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇది అతనికి 100వ అంతర్జాతీయ టీ20 కాగా.. న్యూజిలాండ్ తరఫున ఈఘనతనందుకున్న తొలి మెన్ క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. ఓవరాల్‌గా మూడో క్రికెటర్‌గా నిలిచాడు.

ఈ జాబితాలో 113 మ్యాచ్‌లతో పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్ అగ్రస్థానంలో ఉండగా.. టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ 108 మ్యాచ్‌లతో టేలర్ కన్నా ముందున్నాడు. పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రీది 99 మ్యాచ్‌లతో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. టీమిండియా లెజెండ్ క్రికెటర్ ఎంఎస్ ధోని 98 మ్యాచ్‌లతో ఐదో స్థానంలో ఉన్నాడు.

గప్టిల్ చేతుల మీదుగా 100వ క్యాప్..
ఇక మ్యాచ్ ప్రారంభానికి ముందు రాస్ టేలర్, సహచర ఆటగాడు మార్టిన్ గప్టిల్ చేతులగా మీదుగా 100వ క్యాప్ అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత్.. ఒకే ఒక్క మార్పుతో గత మ్యాచ్ జట్టుతోనే బరిలోకి దిగుతుంది. విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడంతో అతని స్థానంలో జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ సారథ్యం వహిస్తున్నాడు. ఇక న్యూజిలాండ్ ఎలాంటి మార్పులు లేకుండా గత జట్టుతోనే బరిలోకి దిగుతుంది. విలియమ్సన్ గాయం నుంచి కోలుకోవడంతో తుది జట్టులోకి రాలేకపోయాడని తాత్కలిక కెప్టెన్ టీమ్ సౌథి తెలిపాడు.

ఇక ఇదే మ్యాచ్‌తో రోహిత్‌కు 100వ ఇన్నింగ్స్ కాగా.. ఈఘనతనుందకున్న తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. మొత్తం 108 టీ20లు ఆడిన రోహిత్.. ఈ మ్యాచ్‌తో 100వ సారి బ్యాటింగ్‌కు దిగాడు.గత మ్యాచ్‌లో దారుణంగా విఫలమైన సంజూశాంసన్‌కు టీమ్‌మేనేజ్‌మెంట్ మరో అవకాశం ఇచ్చింది. పైగా అతని కోసం రోహిత్ ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ వచ్చాడు. కానీ శాంసన్ మాత్రం విఫలమయ్యాడు. 5 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ప్రస్తుతం కేఎల్ రాహుల్, రోహిత్ ఆడుతున్నాడు.

Story first published: Sunday, February 2, 2020, 13:06 [IST]
Other articles published on Feb 2, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+