న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs New Zealand మూడో వన్డేకు తప్పని వర్షం ముప్పు.. కరుణించకుంటే సిరీస్ గోవిందా!

India vs New Zealand 3rd ODI: Weather Forecast And Pitch Report Of Christchurch

హామిల్టన్: న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆఖరి పోరుకు సిద్దమైంది. బుధవారం క్రైస్ట్ చర్చ్ వేదికగా జరగనున్న మూడో వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. సిరీస్ కాపాడుకోవాలంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా తప్పనిసరి గెలవాలి. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ తొలి విజయాన్ని నమోదు చేయగా.. రెండో మ్యాచ్ వర్షంతో రద్దయ్యింది. దాంతో మూడో మ్యాచ్‌ కీలకంగా మారింది.

ఈ మ్యాచ్‌లో విజయం సాధించి 2-0తో సిరీస్ కైవసం చేసుకొని టీ20 సిరీస్ ఓటమికి బదులు తీర్చుకోవాలని ఆతిథ్య న్యూజిలాండ్ భావిస్తోంది. మరోవైపు భారత్ మాత్రం ఎలాగైన గెలిచి సిరీస్ కాపాడుకోవాలనే పట్టుదలతో ఉంది. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

చివరి వన్డేకూ వర్ష గండం..

చివరి వన్డేకూ వర్ష గండం..

అయితే ఈ మ్యాచ్‌కు వర్షం గండం పొంచి ఉంది. ఇప్పటికే ఈ పర్యటనలో మూడు మ్యాచ్‌లు వర్షానికి ప్రభావమయ్యాయి. టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా.. చివరి మ్యాచ్ మధ్యలో ఆగిపోయింది. దాంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఫలితాన్ని తేల్చగా స్కోర్లు టై అయ్యాయి. రెండో వన్డే కూడా వర్షంతో రద్దయ్యింది.

బుధవారం క్రైస్టన్ చర్చ్‌లో కూడా వర్షం పడే అవకాశాలున్నాయి. 93 శాతం ఆకాశాన్ని మబ్బులు కమ్మేయనున్నాయని, ఏడు శాతం ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవ్వనుండగా.. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి.

పిచ్ రిపోర్ట్..

పిచ్ రిపోర్ట్..

క్రైస్ట్ చర్చ్‌లో హాగ్లే ఓవల్ పిచ్ భిన్నంగా ఉంటుంది. అటు బ్యాటర్లు ఇటు బౌలర్లకు సహకరిస్తోంది. ఈ వేదికగా భారీ స్కోర్లు నమోదయ్యాయి. అలాగే బౌలర్లు సత్తా చాటిన ఘటనలు ఉన్నాయి. సీమర్లు లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తే ఎంతటి తోపు బ్యాటర్‌నైనా ఇక్కడ ఇబ్బంది పెట్టవచ్చు. అదేవిధంగా బ్యాటర్లు జాగ్రత్తగా టెక్నికల్‌గా ఆడితే భారీ స్కోర్లు నమోదు చేయవచ్చు. ఈ మైదానంలో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 262గా ఉంది.

టైమింగ్స్, లైవ్ డిటైల్స్..

టైమింగ్స్, లైవ్ డిటైల్స్..

భారత కాలమాన ప్రకారం ఉదయం 7 గంటలకే ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌, డీడీ స్పోర్ట్స్ చానెల్లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. టీ20 సిరీస్‌ నెట్ వర్క్ కనెక్షన్‌లో రాలేదు. కానీ ఈ టీ20 సిరీస్ అన్ని నెట్ వర్క్ టీవీల్లో వస్తోంది.

తుది జట్లు (అంచనా)

తుది జట్లు (అంచనా)

భారత్: శిఖర్ ధావన్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్(కీపర్)/ సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

న్యూజిలాండ్: ఫిన్ అలెన్, డేవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్(కెప్టెన్), టామ్ లాథమ్, డారిల్ మిచెల్, గ్లేన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టీమ్ సౌథీ, మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్

Story first published: Tuesday, November 29, 2022, 16:39 [IST]
Other articles published on Nov 29, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X