For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: అంపైర్ తప్పిదానికి విరాట్ కోహ్లీ బలి! కళ్లు దొబ్బయా? అంటూ ఫ్యాన్స్ ఫైర్! (వీడియో)

India vs New Zealand 2nd Test: Virat Kohli Gets Duck Out And Fans Fire On Umpire For Wrong Decisi

ముంబై: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో థర్డ్ అంపైర్ ఘోర తప్పిదానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బలయ్యాడు. లాంగ్ బ్రేక్ అనంతరం మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టిన కోహ్లీ.. చేయని తప్పుకు డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. చతేశ్వర్ పుజారా ఔటైన అనంతరం ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన కోహ్లీకి.. అంపైర్ల రూపంలో బిగ్ షాక్ తగిలింది. ఎల్బీ డబ్ల్యూ విషయంలో ఫీల్డ్ అంపైర్ ఔటివ్వగా.. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విరాట్ కోహ్లీ సమీక్ష కోరాడు.

థర్డ్ అంపైర్ పలుకోణాల్లో పరీక్షించి

ఇక థర్డ్ అంపైర్ పలుకోణాల్లో పరీక్షించి కోహ్లీ ఔటవ్వలేదనడానికి కావాల్సిన సాక్ష్యం లేదని చెబుతూ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సమర్థించాడు. ఇక ఈ నిర్ణయంతో కోహ్లీతో పాటు మైదానంలో ఉన్న అభిమానులు, ఇతర ఆటగాళ్లంతా అవాక్కయ్యారు. కోహ్లీ అయితే అంపైర్‌తో వాదించాడు. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోని కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో పాటు ఇతర ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ సైతం ఈ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

అసలేం జరిగిందంటే..

భారత ఇన్నింగ్స్ సందర్భంగా ఆజాజ్ పటేల్ వేసిన 30వ ఓవర్‌లో ఈ తప్పిదం చోటు చేసుకుంది. ఆజాజ్ వేసిన చివరి బంతిని కోహ్లీ డిఫెండ్ చేసే ప్రయత్నం చేయగా బంతి బ్యాట్, ప్యాడ్‌ను తాకింది. దాంతో కివీస్ ఆటగాళ్ల గట్టిగా అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ నితీన్ మీనన్ ఔటిచ్చాడు. ఇక బ్యాట్ తాకిందనే ఆత్మవిశ్వాసంతో కోహ్లీ సమీక్ష కోరాడు. థర్డ్ అంపైర్ వీరేందర్ శర్మ పలు కోణాల్లో పరిశీలించాడు. అయితే బ్యాట్‌‌ను తాకిన బంతి ఆ తర్వాత టర్న్ అయి ప్యాడ్‌ను తాకినట్లు కనిపించింది. మరో కోణంలో బ్యాట్, ప్యాడ్‌ను ఒకేసారి కనిపించింది. అల్ట్రా ఎడ్జ్‌లో సైతం స్పైక్స్ కనబడ్డాయి. దాంతో పలు కోణాల్లో పరిశీలించిన వీరేందర్ శర్మ.. బ్యాట్‌ను ముందుగా తాకిందనడానికి ఆధారల్లేవని పేర్కొంటూ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సమర్థించాడు. దాంతో కోహ్లీ నిరాశగా పెవిలియన్ చేరాడు.

కళ్లు దొబ్బాయా?

అయితే థర్డ్ అంపైర్ అనూహ్య నిర్ణయంతో అభిమానులు అవాక్కవుతున్నారు. అంత స్పష్టంగా బ్యాట్‌ను తాకి బంతి టర్న్ అయి ప్యాడ్‌ను తాకినట్లు కనిపిస్తుంటే సరైన ఆధారల్లేవని థర్డ్ అంపైర్ చెప్పడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. థర్డ్ అంపైర్ కళ్లు కనబడటం లేదనకుంటా.. ఓ జత కళ్లద్దాలు కొనివ్వండి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోను చూపించి ఔటిచ్చాడని చెబితే నవ్వుతారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ చరిత్రలోనే ఇదో అత్యంత చెత్త కెప్టెన్సీ అని ఆగ్రహం వ్యక్తం

భారత్ 111/3

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(44), మయాంక్ అగర్వాల్(52 బ్యాటింగ్) మంచి శుభారంభాన్ని అందించారు. ఆచితూచి ఆడుతూ.. తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించారు. ఇక హాఫ్ సెంచరీకి చేరువైన శుభ్‌మన్ గిల్‌ను ఆజాజ్ పటేల్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన చతేశ్వర్ పుజారా(0), విరాట్ కోహ్లీ(0) ఆజాజ్ పటేల్ తన వరుస ఓవర్లలో డకౌట్ పెవిలియన్ చేర్చాడు. పుజారాను బౌల్డ్ చేసిన పటేల్.. కోహ్లీని వికెట్ల ముందు బోల్తాకొట్టించాడు. దాంతో పటిష్టంగా కనిపించిన భారత్ 80 పరుగులకే మూడు వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్(7 బ్యాటింగ్)తో కలిసి మయాంక్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు. దాంతో టీమిండియా 111/3 స్కోర్‌తో టీ బ్రేక్‌కు వెళ్లింది.

Story first published: Friday, December 3, 2021, 15:09 [IST]
Other articles published on Dec 3, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+