For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs New Zealand: కివీస్ చెత్త రికార్డు.. టీమిండియా అదిరిపోయే రికార్డులు!

India vs New Zealand, 2nd Test Stats: Virat Kohli’s record win, Ashwin’s and Ajaz’s record figures

ముంబై: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. దాంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను కోహ్లీసేన 1-0తో కైవసం చేసుకుంది. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. 540 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ భారత స్పిన్నర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే కుప్పకూలింది. డారిల్ మిచెల్(92 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 60), హెన్రీ నికోల్స్(111 బంతుల్లో 8 ఫోర్లు 44), విల్ యంగ్ (41 బంతుల్లో 4 ఫోర్లతో 20), రచిన్ రవీంద్ర(50 బంతుల్లో 4 ఫోర్లతో 18) మినహా అంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితయ్యారు. భారత బౌలరల్లో రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు.

ఈ విజయంతో ఇరు జట్లు పలు ఆసక్తికర రికార్డులు నమోదు చేశాయి. టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు కివీస్ స్పిన్ సెన్సేషన్ ఆజాజ్ పటేల్ సైతం అరుదైన ఘనతలను అందుకున్నారు. ఆ రికార్డులపై ఓ లుక్కెద్దాం.

భారత్‌కు ఇదే భారీ విజయం..

భారత్‌కు ఇదే భారీ విజయం..

టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా భారత్‌కు ఇదే అత్యంత భారీ విజయం. ముంబై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 372 పరుగులతో గెలుపొందింది. ఇప్పటి వరకు ఇదే ఆల్‌టైమ్ రికార్డు. అంతకుముందు 2015లో ఢిల్లీ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 337 పరుగులతో భారత్ గెలుపొందింది. ఇక 2016లో ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇదే న్యూజిలాండ్‌ను భారత్ 321 పరుగులతో చిత్తు చేసింది. 2008లో మోహాలి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 320 రన్స్‌తో గెలిచింది. ఇప్పటి వరకు ఇవే భారీ విజయాలుగా ఉండగా.. తాజాగా ముంబై టెస్ట్ ఫలితం ఈ రికార్డులను అధిగమించింది.

న్యూజిలాండ్ చెత్త రికార్డు..

న్యూజిలాండ్ చెత్త రికార్డు..

తాజా మ్యాచ్‌లో 372 పరుగుల భారీ తేడాతో చిత్తయిన కివీస్ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా న్యూజిలాండ్‌కిదే అత్యంత భారీ ఓటమి.

2007లో జోహెనస్‌బర్గ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కివీస్ 358 రన్స్ తేడాతో ఓడింది. ఇప్పటి వరకు అత్యంత దారుణమైన పరాజయం ఉండగా.. ముంబై టెస్ట్ ఓటమి దాన్ని అధిగమించింది. అంతకుముందు 2016లో భారత్ చేతిలో 321 రన్స్ తేడాతో, 2001లో ఆక్లాండ్ వేదికగా పాకిస్థాన్‌తో 299 రన్స్ తేడాతో కివీస్ ఓటమిపాలైంది.

అశ్విన్..తొలి భారత బౌలర్‌గా..

అశ్విన్..తొలి భారత బౌలర్‌గా..

తాజా మ్యాచ్‌లో 8 వికెట్లు తీసిన అశ్విన్.. ఈ ఏడాది మొత్తం 52 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో 50, అంతకన్నా ఎక్కువ వికెట్లు పడగొట్టడం అశ్విన్‌కిది నాలుగో సారి. 2015, 2016, 2017, 2021లో ఈ ప్రదర్శన చేసిన అశ్విన్‌.. అత్యధిక సార్లు ఆ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఇదివరకు హార్భజన్‌, కుంబ్లే 3 సార్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. దీంతో ఆ ఇద్దరి దిగ్గజాలను అశ్విన్‌ అధిగమించాడు. న్యూజిలాండ్‌పై టెస్టుల్లో ఇప్పటివరకు అశ్విన్‌ తీసిన వికెట్లు 66. రెండు జట్ల మధ్య టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌.. కివీస్‌ దిగ్గజ ఆల్‌రౌండర్‌ రిచర్డ్‌ హ్యాడ్లీ(65)ని అశ్విన్‌ అధిగమించాడు.

 సొంత గడ్డపై అత్యధి వికెట్లు..

సొంత గడ్డపై అత్యధి వికెట్లు..

భారత్‌లో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్లలో అశ్విన్‌ రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే 350 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. అశ్విన్ 300 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత హర్హజన్ సింగ్(265), కపిల్ దేవ్(219) తర్వాతి స్థానాల్లో నిలిచారు. సొంతగడ్డపై అత్యం వేగంగా 300 వికెట్ల క్లబ్‌లో చేరిన రెండో ఆటగాడిగా కూడా అశ్విన్ గుర్తింపు పొందాడు. 48 మ్యాచ్‌ల్లో ముత్తయ్య మురళీ ధరన్ ఈ ఘనతను అందుకొని తొలి స్థానంలో కొనసాగుతుండగా.. అశ్విన్ 49 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్ సాధించి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే(52 మ్యాచ్‌ల్లో), షేన్ వార్న్(65 మ్యాచ్‌ల్లో), జేమ్స్ అండర్సన్(71 మ్యాచ్‌ల్లో), స్టువర్ట్ బ్రాడ్(76 మ్యాచ్‌ల్లో) రికార్డులను అశ్విన్ అధిగమించాడు.

ఆజాజ్ పటేల్ వరల్డ్ రికార్డు..

ఆజాజ్ పటేల్ వరల్డ్ రికార్డు..

ఈ మ్యాచ్‌లో కివీస్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసి వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఇక రెండో ఇన్నింగ్స్ 4 వికెట్లు తీసిన ఆజాజ్.. ఓ టెస్టు మ్యాచ్‌లో భారత్‌పై అత్యుత్తమ ప్రదర్శన చేసిన బౌలర్‌గానూ గుర్తింపు పొందాడు. కివీస్‌ తరపున టెస్టుల్లో అతనికిది రెండో అత్యుత్తమ ప్రదర్శన. రిచర్డ్‌ హ్యాడ్లీ (1985లో ఆస్ట్రేలియాపై 15/123) అగ్రస్థానంలో ఉన్నాడు. భారత్‌లో న్యూజిలాండ్‌ ఆడిన 12 టెస్టు సిరీస్‌ల్లో ఒక్కసారి కూడా సిరీస్‌ కైవసం చేసుకోలేదు. చివరిసారిగా ఆ జట్టు 1988లో వాంఖడే మైదానంలోనే ఒక టెస్టు గెలిచింది.

ఓడినా.. ఆజాజ్ టాప్..

ఓడినా.. ఆజాజ్ టాప్..

తాజా ప్రదర్శనతో ఆజాజ్ పటేల్ మరో ఘనతను అందుకున్నాడు. మ్యాచ్‌లో ఓటమిపాలైనా అత్యంత మేటి బౌలింగ్‌ ప్రదర్శన కనబర్చిన బౌలర్లలో అజాజ్‌(14/225) అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో భారత మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్(13/132) రికార్డును బ్రేక్ చేశాడు. 1999లో పాకిస్థాన్‌పై జవగళ్ శ్రీనాథ్ 13 వికెట్లతో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన భారత్ ఓడిపోయింది. ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమంగా ఉండగా.. తాజాగా ఆజాజ్ సవరించాడు. ఈ జాబితాలో సిడ్నీ బార్న్స్ ( 13/163;1902లో ఆస్ట్రేలియాపై), మెర్వ్‌ హ్యూస్‌( 13/217: 1988లో వెస్టిండీస్‌పై), టామ్‌ రిచర్డ్స్‌ ( 13/244: 1896లో ఆస్ట్రేలియాపై) ఉన్నారు.

Story first published: Monday, December 6, 2021, 13:39 [IST]
Other articles published on Dec 6, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+