For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs New Zealand రెండో వన్డేకు భారీ అడ్డంకి!

India vs New Zealand 2nd ODI: Weather Forecast And Pitch Report Of Hamilton

హామిల్టన్: న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌‌ను ఓటమితో ప్రారంభించిన టీమిండియా మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. ఆదివారం హామిల్టన్ వేదికగా జరగనున్న రెండో వన్డేలో అమీతుమీ తేల్చుకోనుంది. అక్లాండ్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో శిఖర్ ధావన్ సారథ్యంలోని టీమిండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే. 307 పరుగుల భారీ లక్ష్యాన్ని బౌలింగ్ వైఫల్యంతో కాపాడుకోలేకపోయింది. దాంతో రెండో వన్డేలో తప్పక గెలవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది. సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్ గబ్బర్ సేన గెలవాల్సిందే. మరోవైపు న్యూజిలాండ్ మాత్రం తొలి వన్డే విజయంతో జోరు మీదు ఉంది. ఇదే ఉత్సాహంతో రెండో మ్యాచ్ గెలిచి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది.

వర్ష గండం..

వర్ష గండం..

అయితే ఈ మ్యాచ్‌కు వర్షం గండం పొంచి ఉంది. ఇప్పటికే టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా.. చివరి మ్యాచ్ మధ్యలో ఆగిపోయింది. దాంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఫలితాన్ని తేల్చగా స్కోర్లు టై అయ్యాయి. రెండో వన్డే కూడా పూర్తి తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఆదివారం ఉదయం నుంచి హామిల్టన్‌లో భారీ వర్షం పడనుంది. సాయంత్ర వరకు వర్షం కొనసాగనుందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. అయితే మైదానంలో హైటెక్ డ్రైనేజీ సిస్టమ్ ఉండటం సానుకూలంశం. అయితే కాలం గడుస్తున్నా కొద్దీ వర్ష ప్రభావం తగ్గే అవకాశాలు ఉన్నట్లు అక్యూవెదర్ పేర్కొంది. ఉష్ణోగ్రతలు 16 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవ్వనుండగా.. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి.

 పిచ్ రిపోర్ట్..

పిచ్ రిపోర్ట్..

హామిల్టన్ సెడెన్ పార్క్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ వికెట్ బ్యాటర్లకు స్వర్గదామం. ఇక్కడ యావరేజ్ వన్డే స్కోర్ 240గానే ఉన్నప్పటికీ.. ఇటీవల నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 333 పరుగుల భారీ స్కోర్ చేసింది. మైదానం బౌండరీలు చిన్నగా ఉండటం బ్యాటర్లకు కలిసొచ్చే అంశం. 2020 నుంచి ఇక్కడ మూడు వన్డేలు మాత్రమే జరగ్గా.. ఇందులో రెండు సార్లు 330 పైగా స్కోర్లు నమోదయ్యాయి. ఇందులో ఒకసారి టీమిండియా 347 పరుగులు చేసింది. ఆదివారం కూడా భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.

టైమింగ్స్, లైవ్ డిటైల్స్..

టైమింగ్స్, లైవ్ డిటైల్స్..

భారత కాలమాన ప్రకారం ఉదయం 7 గంటలకే ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌, డీడీ స్పోర్ట్స్ చానెల్లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. టీ20 సిరీస్‌ నెట్ వర్క్ కనెక్షన్‌లో రాలేదు. కానీ ఈ టీ20 సిరీస్ అన్ని నెట్ వర్క్ టీవీల్లో వస్తోంది.

తుది జట్లు (అంచనా)

తుది జట్లు (అంచనా)

భారత్: శిఖర్ ధావన్(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్/దీపక్ హుడా, రిషభ్ పంత్(కీపర్), సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్/దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

న్యూజిలాండ్: ఫిన్ అలెన్, డేవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్(కెప్టెన్), టామ్ లాథమ్, డారిల్ మిచెల్, గ్లేన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, టీమ్ సౌథీ, మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్

Story first published: Saturday, November 26, 2022, 19:18 [IST]
Other articles published on Nov 26, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+