Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs New Zealand: రోహిత్ సేనను భయపెడుతున్న మంచు! టాసే కీలకం!

India vs New Zealand 1st T20I: Early Dew Likely To Minimise Toss Advantage In Jaipur

జైపూర్: టీ20 ప్రపంచకప్‌లో మంచుతో ఇబ్బందులు ఎదుర్కొని కనీసం సెమీస్ చేరకుండానే ఇంటిదారిపట్టిన టీమిండియాకు మళ్లీ అదే ప్రమాదం పొంచి ఉంది. బుధవారం నుంచి న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ మంచు కీలకంగా మారబోతున్నది. తొలి మ్యాచ్‌కు వేదికైన పింక్ సిటీ జైపూర్‌లో ఇప్పటికే రాత్రి వేళలో భారీ స్థాయిలో మంచు కురుస్తున్నది.

దీంతో ఈ సిరీస్‌లోనూ టాస్ కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. ఎనిమిదేళ్ల తర్వాత సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం ఫస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తుండటంతో.. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్‌సీఏ) కూడా టీమిండియా విజయం కోసం చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా మ్యాచ్ టైమ్‌లో మంచు ప్రభావం తగ్గించేందుకు కెమికల్స్‌ను స్ప్రే చేయాలని డిసైడ్ అయ్యింది.

'గత రెండు రోజుల నుంచి రాత్రి 7 గంటలకే మంచు కురువడం మొదలైంది. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్‌కు కూడా దీని ప్రభావం ఉంటుంది. మ్యాచ్ రోజు యాంటీ డ్యూ స్ప్రేను ఉపయోగించినా దాని ప్రభావం పరిమితంగానే ఉండనుంది. ఇక్కడ ఫస్ట్ టీ20 మ్యాచ్ కావడంతో ఈ పిచ్‌పై భారీ స్కోర్లు వచ్చే అవకాశాలున్నాయి.'అని ఆర్‌సీఏ అధికారులు తెలిపారు.

కాలుష్యం ముప్పు..

కాలుష్యం ముప్పు..

ఈ మ్యాచ్‌కు మంచుతో పాటు గాలి కాలుష్యం ముప్పు కూడా కనిపిస్తోంది. ఢిల్లీ మాదిరిగా జైపూర్‌లో కూడా గాలి కాలుష్యం లెవల్స్ పెరిగాయి. సిటీలో ఆదివారం ఉదయం విపరీతమైన పొగ కమ్ముకుంది. గత వారం రోజులుగా పింక్ సిటీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 337 పాయింట్లుగా నమోదవుతున్నది. దీంతో మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. అయితే తామున్నది క్రికెట్ ఆడటానికే అని భారత వైస్ కెప్టెన్ లోకేశ్ రాహుల్ అంటున్నాడు. పొల్యూషన్ అంత తీవ్రంగా ఏమీ లేక పోవచ్చని అభిప్రాయపడ్డాడు.

25 వేల మంది ఫ్యాన్స్..

25 వేల మంది ఫ్యాన్స్..

ప్రస్తుతం జైపూర్‌లో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకపోవడంతో ఈ మ్యాచ్‌కు ప్రేక్షకుల సంఖ్య భారీగానే ఉండనుంది. దాదాపు 25 వేల మంది హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టికెట్ల సేల్ మొదలైన మూడు గంటల్లోనే 8 వేలు అమ్ముడుపోయాయని ఆర్‌సీఏ సెక్రటరీ మహేంద్ర వర్మ వెల్లడించాడు. మరోవైపు కొవిడ్ కారణంగా మే నెలలో ఐపీఎల్‌ను అర్దాంతరంగా ముగించి తీసుకెళ్లిన బీసీసీఐ.. ఈ సిరీస్‌ను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించాలని భావిస్తోంది. వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం ఇప్పట్నించే ప్రణాళికలు వేస్తోంది.

భారత్ ప్రాక్టీస్ షురూ..

భారత్ ప్రాక్టీస్ షురూ..

ఈ సిరీస్ కోసం ఇప్పటికే జైపూర్ చేరుకొని మూడు రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న టీమిండియా ప్రాక్టీస్ షురూ చేసింది. కొత్త హెడ్ కోచ్ ద్రవిడ్ పర్యవేక్షణలో సోమవారం తొలి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది. టీ20 నయా సారథి రోహిత్ శర్మ నెట్స్‌లో భారీ షాట్లు కొడుతూ కనిపించాడు. మిగతా ప్లేయర్లు కూడా వామప్స్‌తో పాటు ఫీల్డింగ్ డ్రిల్స్ చేశారు.

నెట్ సెషన్‌లో చెమటోడ్చారు. మరోవైపు ఆదివారం రాత్రి టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఓడిన న్యూజిలాండ్ టీమ్ దుబాయ్ నుంచి చార్టర్ ఫ్లైట్‌లో సోమవారం సాయంత్రం జైపూర్‌లో ల్యాండ్ అయ్యింది. వరల్డ్ కప్ బబుల్ నుంచి నేరుగా వచ్చిన నేపథ్యంలో తొలి మ్యాచ్‌కు ముందు కివీస్ ప్లేయర్లకు ఎలాంటి క్వారంటైన్ అవసరం లేదు. కివీస్ మంగళవారం ప్రాక్టీస్ స్టార్ట్ చేయనుంది.

Story first published: Tuesday, November 16, 2021, 10:12 [IST]
Other articles published on Nov 16, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+