For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs New Zealand మ్యాచ్ అనగానే వరణుడికి మూడ్ వస్తది! నెట్టింట పేలుతున్న మీమ్స్!

India vs New Zealand 1st T20 washout, frustrated fans come up with funny memes

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ వైఫల్యాన్ని మర్చిపోయి భారత్-న్యూజిలాండ్ టీ20 మ్యాచ్‌ను ఆస్వాదించాలని భావించిన అభిమానులకు వరణుడు షాకిచ్చాడు. ఒక్క బంతి కూడా పడకుండా మ్యాచ్‌ను మింగేసాడు. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్.. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా కనీసం టాస్ కూడా పడకుండానే తుడుచుకుపెట్టుకుపోయింది. వీలైతే 5 ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహిద్దామని భావించిన అంపైర్లకు వరణుడు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఇక మ్యాచ్ రద్దయిన తర్వాత ఇరు జట్ల కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఈ ఫొటోను బీసీసీఐ ట్వీట్ చేసింది. అయితే అభిమానులు మాత్రం ఫన్నీ కామెంట్స్‌తో నవ్వులు పూయిస్తున్నారు.

అదేందో వరణుడికి మూడ్ వస్తది..

భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ అనగానే వరణుడికి మూడ్ వస్తదని కామెంట్ చేస్తున్నారు. భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ అనగానే వర్షం, కట్ ఆఫ్ ఓవర్స్, స్వింగ్ బౌలింగ్, బ్యాటింగ్ కష్టం వంటి ఘటనలు పునరావృతమవుతాయని సెటైర్లు పేల్చుతున్నారు. మైదానంలో నిలిచిన నీటిలో హార్దిక్, కేన్ విలియమ్సన్ గెంతులేస్తూ ఆడుకుంటున్నారని మీమ్స్ షేర్ చేస్తున్నారు. వర్షంతో ఈ మ్యాచ్ రద్దవుతుందని ముందు నుంచే అనుకుంటున్నామని కామెంట్ చేస్తున్నారు.

కోహ్లీ, రోహిత్ లేని మ్యాచ్ మాకెందుకు?

ఇంకొందరైతే కోహ్లీ, రోహిత్ ఈ సిరీస్ లేకపోవడం లైట్ తీసుకున్నామని, రద్దయినా నష్టం ఏం లేదని అభిప్రాయపడుతున్నారు. ద్వైపాక్షిక సిరీస్‌లు పెట్టేముందు అక్కడి వాతావరణాన్నిపరిగణలోకి తీసుకోరా? అని బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ మ్యాచ్‌లకు బదులు రైన్ డ్యాన్స్‌ పోటీలు పెట్టాలని చురకలంటిస్తున్నారు. ఈ సిరీస్ మొత్తం వర్షంతో తుడిచి పెట్టుకోపోతుందని, ఎవడూ కూడా పట్టించుకోడని మండిపడుతున్నారు. వచ్చే వారం పాటు న్యూజిలాండ్ వర్షాలున్నాయని, ఒక్క మ్యాచ్ కూడా జరగదని కామెంట్ చేస్తున్నారు.

వెదర్ రిపోర్ట్‌పై ఆసక్తి..

ఈ రోజుల్లో పిచ్ రిపోర్ట్ కంటే వెదర్ రిపోర్ట్ గురించే అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారని ఓ అభిమాని సెటైర్ పేల్చాడు. టీ20 ప్రపంచకప్‌లోనూ వర్షం కారణంగా నాలుగు మ్యాచ్‌లు రద్దయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే క్రికెట్ మ్యాచ్ అనగానే వర్ష సూచన ఉందా? లేదా? అనేది హాట్ టాపిక అవుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. క్రికెట్ మైదానాలకు రూఫ్స్ నిర్మించాలని, అప్పుడే మ్యాచ్‌లు సజావుగా సాగుతాయని కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరమో వర్షంతో భారత్ ఓటమి తప్పించుకుందన్నమాట అని కామెంట్ చేస్తున్నారు.

Story first published: Friday, November 18, 2022, 15:36 [IST]
Other articles published on Nov 18, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+