For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs New Zealand Day 4: బీసీసీఐ కీలక అప్‌డేట్.. వర్షంతో తుడిచి పెట్టుకుపోయిన ఆట!

1st session of Day 4 at Southampton has been washed out

సౌతాంప్టన్: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ నాలుగో రోజు ఆట వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది. ఈ మెగా ఫైనల్‌కు వేదికైన సౌతాంప్టన్‌లో ఉదయం నుంచి వర్షం కురుస్తుండటంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. అయితే ప్రస్తుతం అక్కడ వర్షం ఆగింది. కానీ ఎడతెరిపిలేకుండా కురిసిన వానతో ఔట్ ఫీల్డ్ చిత్తడయింది. దాంతో మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు ఫస్ట్ సెషన్ ఆటను రద్దు చేసి లంచ్ బ్రేక్ ప్రకటించారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ట్విటర్ వేదికగా ప్రకటించింది.

ఇక బీసీసీఐ షేర్ చేసిన ఫొటోలో మైదానాన్ని మెఘాలు కమ్ముకోగా.. పిచ్‌పై కప్పిన కవర్లు అలానే ఉన్నాయి. ఈ ఫొటోలను చూస్తే ఈ రోజు సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. లంచ్ బ్రేక్ అనంతరం అంపైర్లు మరోసారి మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు నాలుగో రోజు ఆటను రద్దు చేశారు.

ఇక ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో ఆటగాళ్లు తమ వ్యాపకాల్లో మునిగిపోయారు. న్యూజిలాండ్‌ క్రికెటర్లు టేబుల్‌ టెన్నిస్‌ ఆడుకుంటున్నారు. మరికొందరు ముచ్చట్లు పెడుతున్నారు. ఇంకొందరు డ్రస్సింగ్‌ రూమ్‌ బాల్కనీల్లో వెచ్చని కాఫీలు ఆస్వాదిస్తున్నారు. సౌతాంప్టన్‌లో పరిస్థితిని బీసీసీఐ సైతం ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ఆట ఆలస్యంగా ఆరంభమయ్యేలా ఉందని పేర్కొంది. వాస్తవంగా ఈ రోజంతా వర్షం పడుతుతందని వాతావరణ శాఖ తెలిపింది. మరీ ప్రస్తుతం వర్షం తగినప్పటికీ మ్యాచ్ జరుగుతుందో లేదో చూడాలి.

మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 92.1 ఓవర్లలో 217 పరుగుల వద్ద ముగిసింది. రహానే (190 బంతుల్లో 5 ఫోర్లతో 49), కోహ్లీ (196 బంతుల్లో 1ఫోర్‌తో 44) రాణించారు. బౌల్ట్, వాగ్నర్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత న్యూజిలాండ్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. భారత స్కోరుకు 116 పరుగుల దూరంలో నిలిచింది. విలియమ్సన్‌ (12 బ్యాటింగ్‌), రాస్‌ టేలర్‌ (0 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. అశ్విన్, ఇషాంత్‌కు చెరో వికెట్‌ దక్కింది.

Story first published: Monday, June 21, 2021, 20:02 [IST]
Other articles published on Jun 21, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+