For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Ireland రెండో టీ20కి భారీ అడ్డంకి!

డబ్లిన్: ఐర్లాండ్ పర్యటనను విజయంతో ప్రారంభించిన టీమిండియా మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. ఆదివారం జరగనున్న రెండో టీ20లో ఆతిథ్య ఐర్లాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. వర్షం అంతరాయం కలిగించిన తొలి టీ20లో భారత్ డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 2 పరుగుల తేడాతో గెలుపొందింది.

వర్షం కారణంగా తొలి టీ20లో 40 ఓవర్లకు 26.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఇక రెండో టీ20కి కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. అయితే ఉష్ణోగ్రతలు 16 నుంచి 22 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని, మ్యాచ్ సమయానికి 10-20 శాతం వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. దాదాపు మ్యాచ్ పూర్తిగా జరిగే అవకాశం ఉందని, వర్షం వచ్చినా కొన్ని ఓవర్ల ఆటనే కోల్పోవచ్చని అక్కడి అధికారులు తెలిపారు.

India vs Ireland, 2nd T20I weather forecast: rain Will play spoilsport

తొలి టీ20 విజయంతో టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. భారత పేస్ బౌలింగ్‌ ముందు ఐర్లాండ్ బ్యాటర్లు నిలబడలేకపోయారు. వరుసగా పెవిలియన్ బాట పట్టారు. తొలి మ్యాచ్‌లో బౌలర్లు సత్తా చాటినా భారత బ్యాటర్లకు వర్షం కారణంగా అవకాశం దక్కలేదు. రెండో టీ20లో సత్తా చాటేందుకు భారత బ్యాటర్లు సిద్దంగా ఉన్నారు.

ముఖ్యంగా శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, తిలక్ వర్మలతో కూడిన భారత బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. సంజూ శాంసన్‌కు కూడా ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఏడాది పాటు ఆటకు దూరమైన బుమ్రా.. తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. రెండు కీలక వికెట్లతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అదే జోరును రెండో టీ20లో కొనసాగిస్తే టీమిండియాకు తిరుగుండదు.

ప్రసిధ్ కృష్ణతో పాటు రవి బిష్ణోయ్ కూడా సత్తా చాటారు. అర్ష్‌దీప్ సింగ్ ఒక్కడే చివరి ఓవర్లలో ధారళంగా పరుగులిచ్చాడు. అతను కూడా టచ్‌లోకి వస్తే ఐర్లాండ్‌కు కష్టాలు తప్పవు. టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది. మరోవైపు ఐర్లాండ్ కూడా విజయమే లక్ష్యంగా సిద్దమవుతోంది.

తొలి టీ20లో బ్యాటింగ్ వైఫల్యం ఆ జట్టు కొంపముంచింది. తప్పిదాలు సరిదిద్దుకొని రెండో టీ20 ఆడనుంది.

తుది జట్లు(అంచనా)

ఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బాల్‌బ్రినీ, లోర్కాన్ టక్కర్(కీపర్), హ్యారీ టెక్టార్, కర్టిస్ కాంఫెర్, జార్జ్ డాక్‌రెల్, మార్క్ అడైర్, బ్యారీ మెక్‌కార్తీ, క్రైగ్ యంగ్, జోషువా లిటిల్, బెంజమిన్ వైట్

భారత్: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్(కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ప్రసిధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా(కెప్టెన్), రవి బిష్ణోయ్.

Story first published: Saturday, August 19, 2023, 21:59 [IST]
Other articles published on Aug 19, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+